DC VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 3 మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఇవాళ నాలుగో మ్యాచ్ కూడా జరిగింది. ఈ నాలుగో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ గా…. చివరికి…ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కేవలం ఒక్క వికెట్ తేడాతోనే లక్నో సూపర్ జెంట్స్ పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. గతంలో పంజాబ్ కింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ భయంకరమైన… లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో మరో మూడు బంతులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు.
Also Read: Warner Watching SRH vs RR: తెలుగు హీరోతో SRH మ్యాచ్ చూస్తున్న వార్నర్
అసలు ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. తోపు ప్లేయర్ లందరూ తొందరగానే అవుట్ అయ్యారు. అయితే అదే సమయంలో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన అశుతోష్ శర్మ ( Ashutosh Sharma )… లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేశాడు ఈ డేంజర్ ఆటగాడు అశుతోష్ శర్మ ( Ashutosh Sharma ). ఇందులో 5 సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి. 212.90 స్ట్రైక్ రేట్ తో… లక్నో బౌలర్లకు నరకం చూపించాడు. చివరకు సిక్సర్ కొట్టి… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు ఈ డేంజర్ ఆటగాడు అశుతోష్ శర్మ ( Ashutosh Sharma ).
2024 ఐపీఎల్ సమయంలో కూడా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రభంజనమే సృష్టించాడు. ఈ తరుణంలోనే మొన్నటి మెగా వేలంలో చాలా తెలివిగా ఢిల్లీ క్యాపిటల్స్… ఈ కుర్రాడిని కొనుగోలు చేసింది. అయితే జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చేయకుండా… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అశుతోష్ శర్మ ( Ashutosh Sharma ) తో పాటు మరో కుర్రాడు విప్రాజ్ నిగం… కూడా భయంకరమైన బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. అతను 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. 260 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
Also Read: Rahul Athiya Blessed with baby Girl: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా క్రికెటర్…!
లక్నో కొంప మించిన పంత్ కీపింగ్
లక్నో సూపర్ జెంట్స్ కొంప ముంచింది రిషబ్ పంత్ కీపింగ్. చేతికి వచ్చిన స్టంప్ అవుట్ ను… చేయలేకపోయాడు రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్లు నష్టపోయిన సమయంలో…. మోహిత్ శర్మ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. అతడు క్రీజ్ వదిలి బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో బంతి మిస్సైంది. అది నేరుగా రిషబ్ పంత్ చేతిలో పడ్డప్పటికీ దాన్ని మిస్ లీడ్ చేశాడు. దీంతో స్టంప్ అవుట్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత స్ట్రైక్ లోకి వచ్చిన అశుతోష్ శర్మ సిక్సర్ తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఇది ఇలా ఉండగా.. అంతకుముందు.. లక్నో సూపర్ జెంట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన లక్నో సూపర్ జెంట్స్ ఏకంగా 209 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఫినిష్ చేసింది ఢిల్లీ కాపిటల్స్.
Take a bow, Ashutosh Sharma 🙌
What a Match What A Player For Delhi Capitals 🔥 #DCvLSG
— A D V A I T H (@SankiPagalAwara) March 24, 2025