BigTV English

Tamil Nadu Crime: సాంబారులో విషం కలిపి.. నా మొగుడ్ని లేపేశా ప్రియుడితో ఆడియో కాల్ లీక్

Tamil Nadu Crime: సాంబారులో విషం కలిపి.. నా మొగుడ్ని లేపేశా ప్రియుడితో ఆడియో కాల్ లీక్

Tamil Nadu Crime: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా జరుగుతున్న భర్తల హత్యలు.. మిగతా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కోసం వివాహ బంధాన్నే ఫణంగా పెడుతున్నారు. భర్తల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో.. భర్తల హత్యల ఘటనలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. తాజాగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో అలాంటి సంచలన హత్యే జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తకి సాంబార్‌లో విషం కలిపి చంపింది ఓ భార్య.


ఘటనకు నేపథ్యం
ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టికి చెందిన రసూల్ (వయసు 35)కి.. కొన్ని సంవత్సరాల క్రితం అమ్ముబీ అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. స్థానికంగా రసూల్ ఉపాధి కోసం రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

ప్రియుడితో అక్రమ సంబంధం
అమ్ముబీకి అదే గ్రామంలో సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్ అనే వ్యక్తితో.. గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు.. పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన బార్య ఈ దారుణానికి ఒడిగట్టింది.


విషప్రయోగం ద్వారా హత్య
రసూల్ కోసం అమ్ముబీ ప్రత్యేకంగా భోజనం సిద్ధం చేసింది. అతనికి ఎంతో ఇష్టమైన సాంబారులోనే మోతాదుకు మించి విషాన్ని కలిపి వడ్డించింది. సాంబార్ తిన్న కొద్ది సేపటికే రసూల్ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర వాంతులు, కడుపు ఉబ్బరంతో అతడిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం అంతటా వ్యాప్తిచెంది ఉండటంతో.. చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు.

అసలు కుట్ర బయటపడిన విధానం
రసూల్ మృతిపై అనుమానంతో.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి, అమ్ముబీ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె, లోకేశ్వరన్ మధ్య సాగిన వాట్సాప్ సంభాషణలు ఈ కుట్రకు అత్యంత ఆధారంగా మారాయి. అందులో.. నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపా.. దాన్ని నా భర్త తాగలేదు.. దీంతో ఆహారంలో కలిపా.. అంటూ అమ్ముబీ పేర్కొంది. ఈ మాటలు విన్న పోలీసులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత, పోలీసులు తక్షణమే అమ్ముబీతో పాటు లోకేశ్వరన్‌ను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు.

Also Read: పాఠశాల పైనుంచి దూకిన విద్యార్థి మృతి.. అసలేం జరిగింది?

సమాజంపై ప్రభావం
ఈ ఘటన స్థానికంగా కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ తన స్వార్థం కోసం.. భర్తను హత్య చేయడమే కాకుండా, పిల్లల భవిష్యత్తును కూడా చీకట్లోకి నెట్టేసిందని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భార్యగా, తల్లిగా నెరవేర్చవలసిన బాధ్యతలను విస్మరించి, ప్రియుడి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న అమ్ముబీని.. కఠిన శిక్షలు విధించాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×