ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారికోరిలో రాత్రి 11 గంటల సమయంలో అతి వేగంగా వెళ్లిన బస్సు బీభత్సం సృష్టించింది. వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టి.. వంతెన మీది నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణీకులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
నిన్న సాయంత్రం(సెప్టెంబర్ 11) బస్సు హార్డోయ్ నుంచి లక్నోకు బయల్దేరింది. కారికోరికి చేరుకోగానే బస్సును డ్రైవర్ మరింత వేగంగా నడిపాడు. అక్కడున్న వంతెన మీదికి చేరగానే బస్సు కంట్రోల్ తప్పింది. మందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో ఎగిరి వంతెన మీది నుంచి 20 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణీకులు అక్కడిక్కడే చనిపోయారు. 10 మందికిపైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద విషయం తెలియగానే లక్నో డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ విశాఖ్, పోలీస్ కమీషనర్ అమరేంద్ర సింగ్ సెంగర్ స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిఒంచారు. గాయపడిని వారిని కారికోరిలోని హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సహాయక చర్యల్లో కారికోరి పోలీసులతో పాటు మలిహాబాద్ పోలీసులు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో పాటు 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.
అటు కారికోరి బస్సు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జిల్లా అధికారులను స్పాట్ కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను అదేశించారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
ఈ బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీస్ కమీషనర్ అమరేంద్ర సింగ్ సెంగర్ తెలిపారు. విచారణ మొదలు పెట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు