KL Rahul – Mumbai Indians: ఐపీఎల్ 2025 వేలం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. కేఎల్ రాహుల్ కొత్తగా ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించాలని అనుకున్నాడు. రాహుల్ ను లక్నో ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అంతకుముందే రాహుల్ జట్టును వీడాలని అనుకున్నాడు. సన్రైజర్స్ తో మాచ్ తర్వాత గతంలో గ్రౌండ్ లో రాహుల్ పై జట్టు ఓనర్ సంజీవ్ సీరియస్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడే రాహుల్ టీం నుంచి వైదొలుగుతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ రాహుల్ తన ఆటను అలానే కొనసాగించాడు. అందరూ అనుకున్నట్టుగానే ఈసారి రాహుల్ ను లక్నో రిటైన్ చేసుకోలేదు.
Also Read: Shikhar Dhawan – NPL 2024: ఐపీఎల్ కు గుడ్ బై..నేపాల్ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?
Also Read: Arjun Tendulkar: భయంకరమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన సచిన్ కొడుకు..వేలంలో భారీ ధర పక్కా !
దీంతో రాహుల్ వేలంలో బరిలోకి దిగారు. రాహుల్ కోసం ఫ్రాంచైజీలు అన్ని వరుసలో ఉన్నాయి. ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా జట్టుకు రాహుల్ సేవలను ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయి. రాహుల్ ను ఏ జట్టు కొనుగోలు చేస్తుందనే దానిపైన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నివేదికల ప్రకారం చూసినట్లయితే రాహుల్ ఆర్సిబిలోకి వెళతాడని సమాచారం అందుతోంది. గతంలో రాహుల్ ఆర్సిబిలో ఆడాడు. పైగా కోహ్లీకి, రాహుల్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. రాహుల్ కనుక ఆర్సిబిలోకి వెళ్లినట్లయితే ఆర్ సి బి బ్యాటింగ్ దళం మరింత బలంగా తయారవుతుంది. పైగా కీపింగ్ కూడా పటిష్టమవుతుంది.
Also Read: South Africa vs India, 3rd T20I: మూడో T20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ
మరి రాహుల్ ఆర్సిబిలోకి వెళ్తాడా లేదా మరేదైనా జట్టులోకి వెళతాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ముంబై ఇండియన్స్ కూడా కేఎల్ రాహుల్ ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ చేస్తుందట. మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్ర, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను ఉంచుకుంది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ను విడుదల చేసింది. దీంతో ఆ జట్టుకు కీపర్ లేడు, అటు రోహిత్ జట్టుకు ఓపెనర్ లేడు. అయితే వేలంలో రాహుల్ ను తీసుకుంటే ఈ రెండు బాధ్యతలు ఒక్కడే నిర్వర్తిస్తాడు.
పైగా ముంబై ఇండియన్స్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆ విధంగా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలోనే జట్టును ఓ దారికి తీసుకురావాలంటే రాహుల్ ను కచ్చితంగా దక్కించుకోవాలని ముంబై యాజమాన్యం పట్టుపడుతోందట. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఓపెనింగ్ చేశాడు. పైగా అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ కూడా. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ముంబై ముందు రాహుల్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.