Prasanna Vs Divya: రిప్లింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం రచ్చ అయ్యింది. నాలుగు గోడలు మధ్య తేల్చుకోవాల్సి వ్యవహారం.. చివరకు నలుగురు మధ్యకు వచ్చింది. చివరకు అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ప్రసన్న, ఓ సంచలన పోస్ట్ పెట్టారు. దానిపై తీవ్ర రచ్చ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగేశారు. అరెస్ట్ చేయమని హామీతో ఈ వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగినట్టు కనిపిస్తోంది.
స్టోరీలోకి వెళ్తే..
అసలేం జరిగింది? ప్రసన్న శంకర్ నారాయణ-ఆయన భార్య దివ్య మధ్య ఏం జరిగింది? పోలీసులు ఎంట్రీ ఇవ్వడానికి అసలు కారణమేంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ టెక్ స్టార్టప్ ‘రిప్లింగ్’ సహ వ్యవస్థాపకుడు. చాలా స్టార్టప్ కంపెనీల్లో భారీ ఎత్తున ఇన్వెస్టుమెంట్ పెట్టారు. ఇక ప్రసన్న శంకర్ నారాయణ పర్సనల్ మేటర్ విషయానికొద్దాం.
ప్రసన్న శంకర్ నారాయణ -దివ్య దంపతులు. ఈ జంటకు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. మొదట్లో బాగానే ఉండేవారు. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కాకపోతే భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చివరకు ఒకరి ముఖం మరొకరు చూడలేని పరిస్థితికి చేరింది. కలిసి కలహాల కంటే విడిపోతే బెటరని దంపతులు ఓ నిర్ణయానికి వచ్చేశారు.
అమెరికా కోర్టులో విడాకుల వ్యవహారం
వారి విడాకుల వ్యవహారం ప్రస్తుతం అమెరికా కోర్టులో ఉంది. అయితే దివ్య, ఆమె కొడుకు అమెరికా పౌరులు. భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య ప్రధాన డిమాండ్. దీనిపై ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కాస్త అమెరికా టు చెన్నైకి మారింది.
ALSO READ: 9 ఏళ్ల బాలుడు రెండేళ్లుగా ఇంట్లో ఒంటరి
అమెరికా టు చెన్నై
అమెరికా న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రసన్నకు వీకెండ్‌లో కుమారుడితో గడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కొడుకుని భర్త కలిసేందుకు అంగీకరించలేపోయింది దివ్య. ఈ నేపథ్యంలో వారం కిందట కొడుకుతో కలిసి అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అయితే ప్రసన్న తన ఫ్రెండ్ గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్‌లో తీసుకెళ్లాడు. తన కొడుకిని ప్రసన్న కిడ్నాప్ చేశారంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో వీరిద్దరి మధ్య వ్యవహారం కాస్త బయటకు పొక్కింది. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రసన్న శంకర్ దుయ్యబట్టారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కొడుకు తనతో సంతోషంగా ఉన్నాడని, ప్రసన్న పోస్టు పెట్టారు. కేవలం డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని ప్రసన్న ఆరోపించారు.
రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోలీసులు. తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను పోలీసులు ట్రాక్ చేస్తున్నారని ఆరోపించారు ప్రసన్న శంకర్. పోలీసుల హామీతో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారాయన. మరి ప్రసన్న శంకర్ నారాయణ-దివ్య ఎపిసోడ్‌కు ముగింపు ఎలా అన్నదే అసలు ప్రశ్న.
My name is Prasanna, who previously founded Rippling (worth $10B); I'm going through a divorce. I'm now on the run from the Chennai police hiding outside of Tamil Nadu. This is my story.
— Prasanna S (@myprasanna) March 23, 2025