Kunal Kamra Eknath Shinde| మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక స్టాండప్ కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న కమ్రా.. శిందేను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను శిందేను “ద్రోహి” అని పేర్కొన్నాడు. ఈ సంఘటన తర్వాత కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబైలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో నిర్వహించాడు. ఈ ప్రదర్శనలో అతను డిప్యూటీ సీఎం శిందేను ఉద్దేశిస్తూ పరోక్షంగా హాస్యం చేశాడు. “శివసేన నుంచి మరో శివసేన బయటకు వచ్చింది, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది, అంతా గందరగోళంగా ఉంది” అని మహారాష్ట్ర రాజకీయాలను ఎత్తి చూపాడు. అలాగే, హిందీ పాట “దిల్ తో పాగల్ హై”లోని పదాలను మార్చి, శిందేపై అవమానకరంగా పాడాడు.
ఈ స్టాండప్ కామెడీ వీడియోను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ట్విట్టర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసి.. “కునాల్ కా కమల్” అని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం మరింత తీవ్రమైంది. ఆ వెంటనే శిందే శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హోటల్ లోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత, హాబిటాట్ కామెడీ క్లబ్ తాత్కాలికంగా మూసివేయబడింది.
Also Read: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. బెట్టింగ్ కోసం రూ.3 కోట్ల ప్రభుత్వ నిధులు వాడుకున్న అధికారి
కమ్రాపై కేసు:
శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, కమ్రాపై IPC సెక్షన్లు 500 (అపఖ్యాతి), 504 (ఉద్దేశపూర్వక అవమానం) కింద కేసు నమోదయింది. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలను రేకెత్తించింది. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే హోటల్‌పై దాడిని ఖండించారు, కానీ కమ్రా పాడిన పాట “100% నిజం” అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ దాడి ఎవరో కుట్రగా నిర్వహించారని ఆరోపించారు.
కమ్రా క్షమాపణలు చెప్పాలి: ముఖ్యమంత్రి ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను కామెడీకి వ్యతిరేకం కాదు, కానీ హాస్యం పేరుతో ఎవరినైనా అవమానించడం సరికాదు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. కునాల్ కమ్రా క్షమాపణ చెప్పాలి” అని పేర్కొన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివాదంపై స్పందించిన పలువురు నేతలు
ఎన్సీపీ నేత అజిత్ పవార్: “ఎవరూ చట్టం మీరకూడదు. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ పోలీసులు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి రాకూడదు.”
కాంగ్రెస్ నేత జయాప్రద బచ్చన్: “భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. శిందే తన పార్టీని వదిలి అధికారం కోసం ఇతరులతో కలిసారు, ఇది బాలాసాహెబ్ ఠాక్రేకు అవమానం కాదా?. కామెటీ కార్యక్రమం జరిగిన హోటల్ పై శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను.”
శిందే శివసేన నేత సంజయ్ నిరుపమ్: “కునాల్ కమ్రా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. అతను శిందేపై దిగజారిన వ్యాఖ్యలు చేశాడు. క్షమాపణ చెప్పేవరకు అతన్ని వదిలేదు కాదు. కమ్రా కామెడీ షో బుకింగ్ స్ కోసం ఉద్ధవ్ ఠాక్రే అందించారు.”
నేను క్షమాపణలు చెప్పను: కునాల్ కమ్రా
తాను చేసిన వ్యాఖ్యలపై తనకు పశ్చాత్తాపం చెప్పలేదని.. కోర్టు ఆదేశిస్తేనే క్షమాపణ చెబుతానని ముంబై పోలీసులకు తెలిపాడు.