Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు…. గత సీజన్ లో కేఎల్ రాహుల్ ను గ్రౌండ్ లో నిలబెట్టి…తిట్టినట్లు తాజాగా రూ. 27 కోట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా బండ బూతులు తిడుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ టీమ్ విజయం సాధించింది. ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన అశుతోష్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ తో చెలరేగాడు.
Also Read: DC VS LSG: అశుతోష్ శర్మ భయంకర బ్యాటింగ్.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ !
దీంతో.. సులభంగా గెలిచే లక్నో సూపర్ జెయింట్స్… ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే… ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవడంతో… లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా చాలా అసంతృప్తిగా కనిపించాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత… లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తో చాలా సీరియస్ గా ఎదో మాట్లాడినట్లు వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో… కేఎల్ రాహుల్ ను గ్రౌండ్ లో నిలబెట్టి…తిట్టినట్లు తాజాగా రూ. 27 కోట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా బండ బూతులు తిడుతున్నట్లు ఈ వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా దగ్గరకు ఏ కెప్టెన్ వెళ్లినా.. ఇదే అవమానం ఎదుర్కొంటారని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.
గతంలో ధోని, కేఎల్ రాహుల్ ఇదే అవమానం
గతంలో మహేంద్ర సింగ్ ధోని, కేఎల్ రాహుల్ ఇదే అవమానం ఎదుర్కొన్నారన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోతే చాలు… మహేంద్ర సింగ్ ధోని, కేఎల్ రాహుల్ లపై పడిపోయాడు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా. ఇక ఇప్పుడు రూ. 27 కోట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు అదే జరుగుతోందని అంటున్నారు. మరి ఈ విషయంపై రిషబ్ పంత్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Rahul Athiya Blessed with baby Girl: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా క్రికెటర్…!
కొంప ముంచిన రిషబ్ పంత్
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో బౌలర్ మోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… స్టంప్ ఔట్ మిస్ చేశాడు పంత్. అప్పటికే 9 వికెట్లు నష్టపోయి… ఓటమి అంచున ఢిల్లీ ఉంది. ఆ సమయంలో పదో వికెట్ ను పంత్ మిస్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీనికి కారణం పంత్. అందుకే పంత్ ను ట్రోలింగ్ కూడా చేస్తున్నారు లక్నో ఫ్యాన్స్.
Sanjiv Goenka looking at Rishabh Pant stumping chance and Ashutosh sharma smacking with LSG bowlers pic.twitter.com/tAC0BE2G9x
— ICT Fan (@Delphy06) March 24, 2025