BigTV English

Crime News: చెల్లితో ప్రేమ.. పార్టీకి అని పిలిచి ఎలా ప్లాన్ చేసి చంపేశారంటే!

Crime News: చెల్లితో ప్రేమ.. పార్టీకి అని పిలిచి ఎలా ప్లాన్ చేసి చంపేశారంటే!

Crime News: ప్రస్తుత కాలంలో ప్రేమ, వివాహేతర సంబంధాల కారణంగా మనుషులు మృగాలు లాగా మారుతున్నారు. మధ్యలో వచ్చిన వారిని ముందు వెనుక ఆలోచించకుండా నరుకుతున్నారు. అయితే ఇది అంతా చెబుతున్నామంటే.. ప్రేమ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. తన చెల్లిని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశాడు. అతి గోరాతి గోరంగా ఆ యువకుడిని కొట్టి గొంతు నులిమి ప్రేమికుడి ప్రాణాలను ఆ యువతి అన్న తీసేశాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యా్ప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరంలో యువకుడి మిస్సింగ్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి ప్రేమ వ్యవహారంలో ఆ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన నిందితులు భయంతో స్థానిక వీఆర్‌వో దగ్గర లొంగి పోవడంతో అసలు విషయం తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్.

పి.వేమవరంకు చెందిన కార్తీక్‌కు, అదే గ్రామానికి చెందిన యువతితితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇదే విషయంపై యువతి అన్న కృష్ణ ప్రసాద్‌… కార్తీక్‌ను గతంలో మందలించాడు.ప్రేమ వ్యవహారం ఆపక పోవడంతో గత నెల 24న పార్టీకి అని పిలిచి.. బ్రహ్మానందపురంలో ఉన్న ఓ లేఅవుట్లో కార్తీక్‌ను చంపి అక్కడే పూడ్చి పెట్టారు.


Also Read: గద్వాల్ రైతులను ముంచేస్తున్న సీడ్ మాఫియా.. కాపాడాలంటే ఏం చేయాలి?

అయితే కుమారుడు కనిపించకపోవడంతో కార్తీక్‌ తండ్రి వెంకట రమణ ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత మూడు రోజులుగా మా అబ్బాయి కనిపించడం లేదు అని పోలీసులకు తెలిపాడు. దీంతో కార్తీక్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే దీనికంటే ముందే స్థానిక వీఆర్ఓ వద్ద కార్తీక్‌ను చంపినట్లు కృష్ణ ప్రసాద్ అంగీకరించినట్లు తెలిపారు. కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలను ఆధారంగా తీసుకుని నిందితుడని పాతి పెట్టిన శవాన్ని వెలికితీశారు. అయితే హత్య జరిగి 10 రోజులు కావడంతో కార్తీక్ మృతదేహం కుళ్లిపోయింది. దీంతో పోలీసులు అక్కడే పోస్ట్ మార్టం చేయించారు. తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కార్తీక్ తల్లి స్వరూప, తండ్రి వెంకట రమణ.. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన కృష్ణ ప్రసాద్‌ను పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×