Kamal Haasan: దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో దాదాపు 38 సంవత్సరాల తర్వాత కమలహాసన్ (Kamal Haasan) చేసిన చిత్రం థగ్ లైఫ్ (Thuglife). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమలహాసన్ కన్నడ భాషపై చేసిన కామెంట్లకు పూర్తి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడిగుళు కమలహాసన్ క్షమాపణ చెప్పకపోతే.. ఈ సినిమాను కర్ణాటకలో విడుదలకు అడ్డుకుంటామని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారుm బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరగా.. హైకోర్టును ఆశ్రయించారు కమలహాసన్. కమలహాసన్ క్షమాపణ చెప్పాల్సిందే అని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎట్టకేలకు కన్నడిగుళకి కమలహాసన్ క్షమాపణ చెప్పినా తన సినిమాను మాత్రం కర్ణాటకలో విడుదల చేయలేదు.
కవుల హాసన్ కు మధ్యంతర ఉత్తర్వులు..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈయనకు మరొకసారి షాక్ ఇచ్చింది కర్ణాటక కోర్టు. ముఖ్యంగా కన్నడ భాషకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కమలహాసన్ కి బెంగళూరు కోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇకపోతే ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేయడం గమనార్హం. మొత్తానికి అయితే కమలహాసన్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
కన్నడ భాష పై కమలహాసన్ కామెంట్..
అసలు విషయంలోకి వెళ్తే.. థగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా “తమిళం నుంచి కన్నడ పుట్టింది” అంటూ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని అధికార, విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించాయి. మే 30వ తేదీ లోపు క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు..
హైకోర్టును ఆశ్రయించిన కమలహాసన్..
అయితే ఈ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ కమలహాసన్ ముందుగానే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా మూవీ రిలీజ్ ను ఆపకుండా చూడాలి అని హైకోర్టును కోరారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కమలహాసన్. సినిమా రిలీజ్ కి ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ చలనచిత్ర వాణిజ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలి అంటూ విజ్ఞప్తి కోరారు.
కమలహాసన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..
అయితే కమలహాసన్ పిటీషన్ ని కొట్టివేస్తూ క్షమాపణలు చెప్పాలి అని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ క్షమాపణలు చెప్పిన కమలహాసన్ తన సినిమాని మాత్రం విడుదల చేయలేదు. ఇక ఇప్పుడు మళ్లీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది బెంగుళూరు కోర్టు.
ALSO READ:Kannappa Collections: కన్నప్ప మొదటివారం కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?