Varsha Bollamma : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొలమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను ప్రారంభించి, అక్కడ పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. తెలుగులో చూసి చూడంగానే చిత్రంతో లాంచ్ అయింది. అంటుపై ‘జాను’,’మిడిల్ క్లాస్ మెలోడీస్’ లాంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల్లో మాత్రమే నటించింది. అన్నం అభినయం అన్నీ ఉన్నా కూడా ఈమెకు వరుసగా అవకాశాలు అయితే రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. ప్రస్తుత మరి హాట్ టాపిక్ గా మారింది.
సీక్రెట్ ను రీవిల్ చేసిన హీరోయిన్..
హీరోయిన్ వర్ష టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ సినిమాకు అనుకున్నంత రాలేదని కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వర్ష తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అందులోనూ కోడిగుడ్డు లేకపోతే ముద్ద దిగదనేసింది. ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉందని తెలిపింది.
అంతేకాదు.. అతి చిన్న వయసులోని దొంగతనం చేసి మరి మూడు గుడ్లు తినేసిన విషయాన్ని కూడా ఆమె బయట పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే రోజు ఇంట్లో గుడ్డు లేనిది ఆమెకు మీ వద్దని చెప్పింది. ఒకవేళ గుడ్డు లేని రోజు ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుందని తన గురించి తానే బయటపెట్టింది.. ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఈమెపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత గుడ్డు పిచ్చి అయితే ఎలా అంటూ సరదాగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
Also Read:‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఈమె సినిమాల విషయానికొస్తే..
వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ చలనచిత్ర నటి. 2015లో తమిళంలో వచ్చిన ‘సతురన్’ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష, 2019లో వచ్చిన ‘చూసి చూడంగానే’ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.. చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది. వర్ష కూడా నజ్రియా మాదిరిగా ఉంటుంది. వర్ష విజిల్ సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చూసీ చూడంగానే సినిమాలో డ్రమ్మర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నటించింది. వర్ష ఆనంద్ దేవరకొండతో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.. సందీప్ కిషన్ తో ఓ మూవీ చేసింది. ఇప్పుడు రీసెంట్ గా తమ్ముడు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం..