Groom Kills Matchmaker| పెళి అంటే ఇద్దరు అపరిచిత వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించేందుకు చేసుకునే ఒప్పందం. ఒకరికి తోడుగా మరొకరు నిలుస్తామని, ప్రేమ, అభిమానం, నమ్మకం అనే భావాలు ఈ బంధంలో చూపుతామని అగ్నిసాక్షిగా చేసే ప్రమాణం. కానీ చాలా మంది దంపతులు చిన్న చిన్న అభిప్రాయ విభేదాల కారణంగా విడిపోతుంటారు. ఆ సమయంలో ఒకరు చేసిన తప్పుకి మరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఒక కేసులో వివాహ సంబంధాలు
కుదిర్చే బ్రోకర్ (ఏజెంట్) వల్ల కుదిరిన ఒక పెళ్లి పెటాకులైంది. దీంతో సదరు బ్రోకర్ తో వరుడు గొడవపడ్డాడు. ఈ గొడవలో వరుడు కోపంతో ముగ్గురిపై కత్తితో దాడి చేసాడు. ఈ ఘటన మంగళూరు నగరం పరిసరాల్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మంగళూర నగర పరిసరాల్లో ఉన్న వలాచిల్ గ్రామానికి చెందిన సులేమాన్ (50) అనే పెళ్లి సంబంధాలు కుదిర్చే ఒక ఏజెంట్ 8 నెలల క్రితం ముస్తఫా అనే 30 ఏళ్ల యువకుడికి షాషినాజ్ అనే యువతితో వివాహం చేయించాడు. అందుకు మంచి కమిషన్ కూడా తీసుకున్నాడు. కానీ ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి భార్యభర్తల మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో 6 నెలలు పూర్తి కాకుండానే షాషినాజ్ తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ముస్తఫా ఎంత ప్రయత్నించినా ఆమె కాపురానికి రాను ఇక విడాకులే అని తేల్చి చెప్పింది.
దీంతో ముస్తఫా.. తనకు పెళ్లి సంబంధం కుదిర్చిన సులేమాన్ ఈ సమస్యకు కారణమని భావించాడు. అందుకే మే 21, 2025న అతనికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. అతడి వల్లే తన జీవితం నాశనమైందని చెప్పాడు. ముస్తఫా మాటలకు ఆగ్రహం చెందిన సులేమాన్ తన ఇద్దరు కొడుకులు రియాబ్, సియాబ్‌తో కలిసి ముస్తఫా ఇంటికి వచ్చాడు. ముస్తఫా ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రియాబ్, సియాబ్.. ఇంటి బయటే ఉన్నారు.
కాసేపటి తరువాత సులేమాన్ ఆగ్రహంగా బయటికి వచ్చాడు. ముస్తఫాదే తప్పు అంటూ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇది విన్నసులేమాన్ ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చి వెనుక నుంచి సులేమాన్ పై దాడి చేశాడు. సులేమాన్ మెడలో కత్తిని దింపేశాడు. ఆ తరువాత రియాబ్, సియాబ్ పై కూడా దాడి చేశాడు. రియాబ్ ఛాతిలో కత్తితో పొడిచేశాడు. సియాబ్ భుజం పై కూడా కత్తితో దాడి చేశాడు.
Also Read: భర్తను చితకబాది చంపేసిన భార్య.. ఇంట్లో సిసిటీవి కెమెరాలు పెట్టాడని..
స్థానికులు వెంటనే సులేమాన్, అతని ఇద్దరు కొడుకులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సులేమాన్ చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. అతని ఇద్దరు కుమారుల్లో రియాబ్ పరిస్థితి విషమంగా ఉంది. సియాబ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హత్య, హత్యా యత్నం కేసులు నమోదు చేసి ముస్తఫాను అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.