E-Paper
Advertisement

Medchal district: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Medchal district: మేడ్చల్ జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Advertisement

Medchal district: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున ఒక గుండెలు పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎంఎంటిఎస్ (MMTS) డౌన్ లైన్‌పై వెళ్తున్న రైలు కింద పడి ప్రాణాలు వదిలారు. శనివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అనే కోణంలో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

అయితే చర్లపల్లి సెక్షన్‌లోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు గూడ్స్ రైలు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే ఆయన వాకీటాకీ ద్వారా రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు.

Advertisement

పోలీసుల ప్రాథమిక విచారణలో మృతులు బోడుప్పల్‌లోని హరితహరణం కాలనీకి చెందిన వారిగా తేలింది. మృతులను పి. సురేందర్ రెడ్డి (40), ఆయన భార్య పి. విజయ (38), వారి కుమార్తె పి. చేతన రెడ్డిగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఎటువంటి ప్రయాణ టిక్కెట్లు గానీ, ఇతర విలువైన వస్తువులు గానీ లభించకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు ఈ ఘటనపై జీఆర్‌పీ సికింద్రాబాద్ పోలీసులు క్రైమ్ నంబర్ 57/2026 కింద, బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది సంయుక్తంగా ‘జాయింట్ ఆబ్జర్వేషన్ రిపోర్ట్’ను సిద్ధం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబం ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

Also Read: ముగ్గురు మంత్రులు VS కూనంనేని.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ప్రజలకు ఇలాంటి సమస్యలు మానసిక ధైర్యం ముఖ్యం ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు మానసిక నిపుణులను సంప్రదించాలని హెచ్చరించారు. అలాగే సురేందర్ రెడ్డి కుటుంబం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారి బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×