Vikarabad Resort: వికారాబాద్‌లో ది వైల్డర్‌నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలైపోయారు. అనుమతులు లేకుండానే సర్పన్ పల్లి ప్రాజెక్ట్ చెరువులో బోటింగ్ నిర్వహిస్తున్నారు. బోటింగ్ ఫెసిలిటీ ఉంది అంటూ వెల్డర్ నెస్ రిసార్ట్ ప్రచారం చేయగా శనివారం రెండు జంటలు బూటింగ్‌కి వెళ్లాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకుండానే రిసార్ట్ నిర్వాహకులు పంపించేశారు. చెరువు మధ్యలోకి వెళ్లగానే బూట్లు మునిగిపోయాయి. నీటిలో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
ప్రాణం తీసిన సరదా బోటింగ్..
ది వైల్డర్‌నెస్ రిసార్ట్ గత కొంతకాలం నుంచి వికారాబాద్‌లో ప్రాంతంలో రన్ చేస్తున్నాడు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి. అయితే దీనికి ఎలాంటి అనుమతులు లేవు. రిసార్ట్‌లోనే బోటింగ్ గత కొంత కాలం నుంచి రన్ చేస్తున్నారు. రిసార్ట్ కి సంబంధించి అనుమతులు లేవని అధికారులు ఈ ఘటన జరిగిన తర్వాత స్పందించి తెలిపారు. గత 6 నెలల క్రితం ఈ వికారాబాద్ జిల్లాలోని దాదాపుగా 9 రిసార్ట్‌లో అధికారులు తనికిలు చేసినప్పుడు ఈ రిసార్ట్స్‌కి ఎలాంటి అనుమతులు లేవు.. వీటిని వెంటనే మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే అప్పుడు మాత్రమే మూసివేస్తాము.. నోటీసులు జారీ చేస్తామని చెప్పిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది అని చెబుతున్నారు.
అయితే ఇద్దరు మహిళలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదాం అని ఈ రిసార్ట్స్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత బోర్ట్ ఎక్కారు. ఆ సమయంలోనే బోర్ట్ మధ్యలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా బోల్తా పడటంతో ఇద్దరు మహిళలు రితా కుమారి(55), పూనమ్ సింగ్(56) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడి సమీపంలోని స్థానిక హాస్పిటల్‌కి తరలించే సరికే ప్రాణాలు కోల్పోయారు.
Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్! PDSU నేతలు హంగామా..
స్పందించని అధికారులు..
ఈ ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎఫ్.ఐ.ఆర్‌ని చూస్తే అర్థమవుతోంది. ఘటనపై BNS 106(1) కింద పోలీసులు నామమాత్రపు సెక్షన్ పెట్టారు. తెలియని నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే రిసార్ట్ నిర్వాహకులు బోటింగ్‌కు అనుమతించడం తప్పని పోలీసులకు తెలియదా? లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా పంపిస్తే ప్రమాదమని రిసార్ట్ నిర్వాహకులకు తెలియదా? ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ పర్యాటకులను పంపించిన వాళ్లను ఏం చేయాలి? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్‌టు మర్డర్ కేస్ ఎందుకు పెట్టలేదు? BNS 105 సెక్షన్ కింద FIRను ఎందుకు నమోదు చేయలేదు? ఎఫ్‌ఐఆర్‌ని చూస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు… నిందితుని పేరే లేకుండా FIR నమోదు చేశారు… పోలీసులు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారో FIRలో నమోదు చేయకపోవడంతో… పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.