CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన PDSU నేతలను అరెస్ట్ చేసారు పోలీసులు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు PDSU నేతలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. PDSU ముట్టడి నేషథ్యంలో సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా విద్యా రంగం సమస్యలను పట్టించుకోవడం లేదు. ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్‌ను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్న అంశం పై వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలి.. దీంతో పాటుగా ఫీజుల నియంత్రణ చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: విజయనగరం ఉగ్ర లింకుల కేసు.. రంగంలోకి NIA
మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలో డోనేషన్ల పేరుతో బారీ దోపిడి జరుగుతుంది. దాన్ని వెంటనే ప్రభుత్వం అరికట్టాలంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అనేక విద్యారంగ సమస్యలపైన ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి PDSU నేతలు ఈ రోజూ ఉదయం 10 గంటల అనంతరం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
మెయిన్ రోడ్డు నుంచి ఆర్టీసి బస్సులో వచ్చిన నేతలు దాదాపుగా 30 నుంచి 40 మంది ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంవైపు తరలి వచ్చారు. రాష్ట్రంలో ఉన్న అనేక విద్య రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే స్కూల్లు, కాలేజీలు మొదలవుతున్న నేపథ్యంలో ఫీజు నియంత్రణ చట్టం కూడా తీసుకురావలని PDSU నేతలు డిమాండ్ చేస్తున్నారు.