ICC WTC Table : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తలపడుతుంది. ఇందులో తొలి టెస్టు ఇంగ్లాండ్ విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అంతేకాదు.. ఎడ్జ్ బాస్టన్ లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా ఘనత సాధించింది. ఇక్కడ ఒక్క మ్యాచ్ లోనూ విజయం సాధించలేదనే సుదీర్ఘకాల నీరక్షణకు తెరపడినట్టు అయింది. 2022లో ఇక్కడే ఎదురైన ఓటమీకి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ముఖ్యంగా తొలి టెస్టులో చేసిన పొరపాట్లను సరిచేసుకుంది టీమిండియా. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించి.. WTC 2025–27 పాయింట్ల పట్టికలో ఎగబాకింది. తొలి టెస్టులో ఓటమిపాలై.. వెనక్కి చేరుకోవడంతో తాజాగా కాస్త ముందంజలో దూసుకెళ్తోంది.
Also Read : Sachin – Gill: గిల్ కు ఎక్కడో మచ్చ ఉంది.. సచిన్ సంచలన పోస్ట్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా!
టాప్ లో ఆస్ట్రేలియా.. టీమిండియా ఎన్నో స్థానం అంటే..?
ఆస్ట్రేలియా జట్టు 100 శాతంతో 24 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 2 మ్యాచ్ లకు 2 మ్యాచ్ లు విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం టాప్ జట్టు గా నిలిచింది. ఇక శ్రీలంక జట్టు 66.67 శాతంతో.. 16 పాయింట్లు సాధించి టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతోంది. టీమిండియా జట్టు 50 శాతంతో.. 12 పాయింట్లతో టాప్ 3లో కొనసాగతుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా 50 శాతంతో 12 పాయింట్లు సాధించి.. ఒక మ్యాచ్ ఓడిపోవడం.. మరో మ్యాచ్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్ కి ఇప్పుడు మిగతా మ్యాచ్ లు చాలా కీలకం కానున్నాయి. బంగ్లాదేశ్ జట్టు 16.67 శాతంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 1 మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించడం.. మరో మ్యాచ్ డ్రా తో ముగిసిపోవడంతో శ్రీలంక టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతోంది.
తొలి ఆసియా దేశంగా రికార్డు..
మరోవైపు వెస్టీండీస్ జట్టు ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్ లు ఆడితే.. రెండు మ్యాచ్ లు కూడా ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి టీమిండియా కి ఇంగ్లాండ్ లో టెస్టు అంటే ఎప్పుడూ అంత తేలిక ఏమి కాదు. మరో వైపు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా జట్టు ఎలా కొనసాగిస్తుందోనని ఆందోళన ఉండేది. పైగా తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా ఇక రెండో టెస్టులో కూడా ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండిాయా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ విజయంతో రికార్డును నమోదు చేసింది. తొలి ఆసియా దేశంగా రికార్డు నెలకొల్పింది. టీమిండియా ఈ సారి మాత్రం అవకాశాన్ని వదిలిపెట్టలేదు. రెండో టెస్ట్ ఆట ప్రారంభానికి ముందు అద్భుత ఫామ్ కొనసాగించింద. చివరి పంచ్ ను కూడా విజయవంతంగా విసిరింది. ఈ పిచ్ పై ఆకాశ్ దీప్ 99/6 సూపర్ బౌలింగ్ లొ 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది టీమిండియా. 5 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ లో జరుగనుంది. ఆ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి.
Team India climbs to third place with a win over England, while Australia stays unbeaten at the top with 2 out of 2 wins in the WTC 2025–27 cycle! 🇦🇺🔝#WIvAUS #ENGvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/w2yasXEw76
— Sportskeeda (@Sportskeeda) July 7, 2025