E-Paper
Advertisement

Gachibowli Police: హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్

Gachibowli Police: హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్
Advertisement

Gachibowli Police:  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సీఆర్ రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన 60 ల్యాప్‌టాప్‌ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్‌టాప్‌ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. ఈ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

Also Read: Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

దొంగిలించిన  60 ల్యాప్‌టాప్‌లు

Advertisement

ఈ కేసులో నిందితులు కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన రెగుల చంద్ర శేఖర్ (30), అలాగే బీటెక్ చదువుతున్న విద్యార్థులు చెరుకూరి సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) లు గా పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు నిందితులు రాత్రి సమయంలో అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి 60 ల్యాప్‌టాప్‌లను అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గౌలిదొడ్డి ప్రాంతంలోని నెక్స్ జెన్ హాస్టల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుండి మొత్తం దొంగిలించిన ఆస్తిలో భాగంగా 60 ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, అలాగే నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి. నరేష్ దర్యాప్తు చేయగా, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ కె. బాలరాజు మార్గదర్శకత్వంలో, ఏసీపీ జి. వెంకట రమణ గౌడ్, అదనపు డీసీపీ ఎన్. ఉదయ్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్, పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×