UP Crime News: తన సుఖం కోసం అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను దారుణంగా చంపేసింది ఓ మహిళ. పైగా తనకు ఏమీ తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ నెపాన్ని ఇరుగుపొరుగు వారిపై తోసేందుకు ప్రయత్నం చేసింది. చివరకు లోగుట్టును బయటపెట్టారు పోలీసులు. సంచలనం రేపిన ఘటన యూపీలో వెలుగు చూసింది.
స్టోరీలోకి వెళ్తే..
యూపీలోని దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మణ్ ఖేడ గ్రామంలో రీనా- ధీరేంద్ర దంపతులు ఉండేవారు. దీరేంద్ర ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసేవాడు. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పనికి వెళ్లేవాడు. దీన్ని అలుసుగా తీసుకున్న రీనా, తన మేనల్లుడు సతీష్‌పై ప్రేమ వ్యవహారం నడిపింది. రెండేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు.
ధీరేంద్ర ఇంట్లో లేనప్పుడు సతీష్ వచ్చేవాడు. ఓ రోజు పని మధ్యలో ఇంటికి వచ్చాడు ధీరేంద్ర. భార్య రీనా- ఆమె మేనల్లుడు సతీష్‌తో క్లోజ్‌గా ఉండడం గమనించాడు. వీరిని పట్టుకోవాలని పక్కాగా స్కెచ్ వేశాడు. భార్య లోగుట్టు తెలుసుకునేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు.
అదే జరిగితే తమ గుట్టు బయటపడుతుందని భావించింది రీనా. ఈ విషయాన్ని మేనల్లుడు సతీష్‌కు చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంపడం తప్పితే మరోమార్గం లేదని భావించారు రీనా, ఆమె మేనల్లుడు. ముందుగా అనుకున్నట్లుగానే ధీరేంద్రను చంపాలనే నిర్ణయానికి వచ్చేశారు.
ALSO READ: రాష్ట్రంలో పిడుగుల బీభత్సం, ఇద్దరు చనిపోయారు
మేనల్లుడితో వివాహేతర సంబంధం
మే 11న ఇంట్లోనే హత్య ధీరేంద్రను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కొట్టి చంపారని నిర్ధారించారు. మృతుడి భార్య రీనా మాత్రం తన భర్తను పక్కింటివారు చంపారంటూ ఆరోపణలు చేసింది. ట్రాక్టర్ విషయంలో ఇరుగుపొరుగువారు తన భర్తతో గొడవ జరిగిందని వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది రీనా.
చివరకు గొడవపెట్టుకున్నవారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయినా పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణుల తనిఖీలో ఇంటిలో రక్తం మరకలు కనిపించాయి. హత్యకు ఉపయోగించినట్లుగా భావిస్తున్న మంచంకోడు లభించింది. ఈ క్రమంలో జాగిలాలు ధీరేంద్ర ఇంటి వద్ద ఆగిపోయింది.
ఆ తర్వాత హత్య జరిగిన రోజు రాత్రి రీనా తన మేనల్లుడు సతీష్‌తో సుమారు 40 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో సతీష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. హత్య జరిగిన రోజు రాత్రి ధీరేంద్రకు మత్తు మాత్రలు కలిపిన ఆహారాన్ని ఇచ్చింది రీనా.
స్పృహ కోల్పోయిన తర్వాత తనకు రీనా ఫోన్ చేసిందని సతీష్ అంగీకరించాడు. ధీరేంద్రను మంచం కోడుతో కొట్టి చంపామని, ఇద్దరం కలిసి రక్తం మరకలు శుభ్రం చేశామని వెల్లడించాడు. సతీష్ ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొదట్లో అరెస్టు చేసిన పక్కింటివారిని విడుదల చేశారు పోలీసులు.