Amrit Bharat Railway Station: దేశవ్యాప్తంగా 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు రేంజ్‌లో ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోడీ చొరవతో బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారయన్నారు కిషన్‌రెడ్డి. ఈ స్టేషన్‌లో మొత్తం మహిళలే సిబ్బందిగా ఉండబోతున్నారని చెప్పారు.
తెలంగాణలో మరో 40 రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు కిషన్‌రెడ్డి. 2026 నాటికి ఆధునీకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు MMTS వేయాలని కోరినా గత ప్రభుత్వాన్ని పట్టించుకోలేదన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇప్పుడు కిషన్‌రెడ్డి చొరవ చూపినందుకు ధన్యవాదాలన్నారు.
బేగంపేట్ రైల్వే స్టేషన్ కలర్‌ఫుల్‌గా మారిపోయింది. స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఇక అత్యాధునిక హంగులతో వెయింటింగ్ హాల్స్‌ను ఆధునీకరించారు. మొత్తం నాలుగు ఎస్కలేటర్లు, రెండు లిఫ్టులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు, విశాల ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్లలో మొత్తం మహిళా ఉద్యోగులే ఉండటం మరో స్పెషాల్టీ.
నిధులు రావడమే ఆలస్యం.. పనులు వెంటనే ప్రారంభించారు. చకచకా ఆధునీకరణ పూర్తి చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 25.85 కోట్ల ఖర్చు చేయగా, వరంగల్‌కు 25.41 కోట్లు, బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను 26.55 కోట్లతో ఆధునీకరించారు. ఎయిర్‌పోర్టుల తరహాలో అప్‌గ్రేడ్ చేశారు. విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయింటింగ్ హాల్స్‌ను తీర్చిదిద్దారు. ఇటు దివ్యాంగుల కోసం ర్యాంపులు, లేటెస్ట్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. గురువారం నాడు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దాదాపు 25.41 కోట్లతో కేంద్రం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఖర్చు చేసింది. కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా స్టేషన్‌ను సుందరీకించారు. టూరిస్ట్ స్పాట్‌లా కూడా ఇది రూపుదిద్దుకుంది.
వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ర్యాంప్ నిర్మించారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు కూడా ఏర్పాటు చేశారు. ట్రైన్లు ఒకేసారి ప్లాట్ ఫామ్ మీదకు వచ్చిన సమయంలో ఈ మధ్యకాలంలో తొక్కిసలాటలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓవర్ బ్రిడ్జ్‌లను విశాలంగా నిర్మించారు.
Also Read: వడగళ్ల వాన.. విమానం ముందు భాగం డ్యామేజ్, తప్పిన పెను ప్రమాదం, కీలక నేతలంతా
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక హంగులతో వెయిటింగ్ హాల్స్ నిర్మించారు. వీఐపీ వెయిటింగ్ లాంజ్ ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది.
సెల్ఫీ స్పాట్‌గా స్టేషన్ ముందు పురాతన రైల్వే ఇంజిన్‌ను ఉంచారు అధికారులు. పార్కింగ్ సదుపాయం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ట్రైన్‌లోనే కూర్చొచి తిన్న ఫీల్ వచ్చేలా ట్రైన్ నమూనాతో.. రైల్ కోచ్ రెస్టారెంట్‌ను నిర్మించారు.