Illu Illalu Pillalu Today Episode may 22 nd: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి ఎంత చెప్పినా కూడా వినకుండా రామరాజుకి భోజనం తీసుకుని వెళ్తుంది శ్రీవల్లి. దాంతో వేదవతి..ఎందుకు ఈ అమ్మాయి చెప్తున్నా వినపించుకోవడం లేదు.. ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు. కానీ ఇంటి పద్దతుల్ని మార్చేయాలని ఎందుకు తాపత్రయ పడుతుంది అంటూ ఆలోచనలో పడుతుంది వేదవతి.. మిల్లుకు వచ్చిన వల్లిని చూసి రామారాజు షాక్ అవుతాడు.. ఇంత ఎండలో ఇక్కడికి ఎందుకు వచ్చావు మేము వస్తాము కదా అని అంటాడు.. మరేం పర్లేదు మామయ్య గారు మీకోసమే కదా తీసుకొచ్చింది అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి రామ రాజుకు ప్రేమ ట్యూషన్ విషయాన్ని బయట పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటి దగ్గర ప్రేమ.. వేదవతి దగ్గరకు వచ్చి.. అత్తయ్యా.. మామయ్య రాగానే ట్యూషన్ గురించి చెప్తాను.. నువ్వే ఎలాగైనా మామయ్యని ఒప్పించాలని అంటుంది. దాంతో వేదవతి.. నా ముద్దుల మేనకోడలు ఇంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే.. మీ మామయ్యని ఒప్పించకుండా ఎలా ఉంటానూ అని అంటుంది. వాళ్లపై ఓ కన్నేసిన శ్రీవల్లి.. గుడ్లగూబలా చూస్తూ ఉంటుంది. ఎంతైనా సొంత మేనకోడలు కదా.. అందుకే అంత ప్రేమ కారిపోతుంది మరి. కానీ నాకు మాత్రం మండిపోతుంది.. అంటూ తెగ ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంట్లోకి రామారాజు వస్తాడు. వచ్చి రాగానే వేదవతిని సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారా అని అడుగుతాడు..
ప్రేమ.. తన ట్యూషన్ గురించి చెప్పడానికి రామరాజు దగ్గరకు వచ్చి.. మీకో విషయం చెప్పాలి మామయ్య గారు అని అంటుంది. ఒక్క నిమిషం ఆగమ్మా అంటూ వేదవతి వైపు చూస్తూ.. ఏంటి బుజ్జమ్మా ఇదీ.. నాకు చెప్పకుండా ఈ ఇంట్లో నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నావా? అని అంటాడు. శ్రీరామా.. శ్రీరామా.. నేనేం చేశానండీ.. అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా.. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? అని అడుగుతుంది. ప్రేమ ట్యూషన్ చెప్తున్న విషయం నీకు తెలుసు కదా ఇంటి పెద్దగా నాకు ఒక విషయం చెప్పాలని మీకు అనిపించలేదా అని అరుస్తాడు.
మావయ్య గారు పిల్లలు వస్తారని నేను అనుకోలేదండి.. వచ్చిన తర్వాతే కన్ఫామ్ చేసుకున్నకే మీకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను అని ప్రేమ అంటుంది. నీ అంతటి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకునే స్టేజ్ కి వెళ్ళిపోయావా? ఇంట్లో ఉన్న పెద్ద మనిషికి చెప్పాలన్న విషయం నీకు తెలియలేదా అని సీరియస్ అవుతాడు. ఇంక నేను ఇంట్లో ఉండడం ఎందుకు నేను వెళ్ళిపోతాను రైస్ మిల్లులోనే ఉంటాను రైస్ మిల్ లోనే పడుకుంటాను మీరు నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు కదా ఇంటిని కూడా మీరే సరి చేయండి అంటూ రామరాజు సీరియస్ అవుతాడు.
నేను ట్యూషన్ చెప్పడం వల్ల ఇంటికి ఇంటి పరువు కి ఎటువంటి భంగం కలగదు మావయ్య గారు.. ధీరజ్ కి సపోర్ట్ గా ఉండాలని నేను ట్యూషన్ చెప్తున్నాను అంతేను అని ప్రేమ అంటుంది.. ఒకసారి ఏమో కాఫీ కప్పులు కడుగుతున్నావని మీ ఇంట్లో వాళ్ళు దారుణంగా మాట్లాడారు. ఆ తర్వాత బయట పడుకున్నావని మీ నాన్న నా గురించి ఊర్లో అందరి ముందర పరువు తీసేసాడు.. నువ్వు ట్యూషన్ చెప్తే వాళ్ళు ఎంత గొడవ చేస్తారో అది ఆలోచించు అని ప్రేమకు చెప్తాడు. లేదు మావయ్య గారు నేను చెప్తానని ప్రేమ అంటుంది. ఇది నేను కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇక్కడ నా మాటే చెల్లాలి. నీకు అంతగా మీరు చెప్పాలి చేయాలనుకుంటే మీరు కట్టించుకున్న ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అంటూ వార్నింగ్ ఇస్తాడు.
రామ రాజన్న మాటలకి ప్రేమ బాధపడుతూ ఉంటుంది. వేదవతి అక్కడికి వచ్చి మీ మామయ్య గారి గురించి తెలుసు కదా అమ్మ నువ్వేం బాధపడకు అని ఓదారుస్తుంది. ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు అత్త రాత్రి ఎప్పుడో గాని ఇంటికి రావట్లేదు. వారం కూడా ఖాళీగా ఉండకుండా కష్టపడుతున్నాడు అని ఏడుస్తుంది. దానికి వేదవతి వాడి తలరాతాల రాసిపెట్టిందేమో అలానే జరుగుతుంది కానీ మీరిద్దరైతే గొడవ పడకండి అని వేదవతి అంటుంది. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు ఇంటి మర్యాద పరువు పోయేలా ఏ పని చేయొద్దు ప్రేమ ఎంత కష్టమైనా నేను భరిస్తాను నిన్ను కష్టపడకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్తాడు.
ధీరజ్ బాధపడుతూ ఉంటే తిరుపతి వచ్చి శ్రీవల్లి మధ్యాహ్నం మిల్లుకు వచ్చింది.. ఈ విషయాన్ని శ్రీవల్లినే చెప్పింది.. అనగానే ధీరజ్ కోపంగా వెళ్లి శ్రీవల్లిని అడుగుతాడు. వదిన మీరు ప్రేమ గురించి నాన్నకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు ఇంట్లో పుల్లలు పెట్టాలని అనుకుంటున్నారా అన్న విధంగా మాట్లాడుతాడు. శ్రీవల్లి అడ్డంగా దొరికిపోవడంతో నాటకాలు మొదలు పెడుతుంది. ఇంకొకసారి ప్రేమ గురించి ఏ విషయాన్ని నాన్నగారి ముందర చెప్పద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మీ ఆవిడ కోసం నువ్వు వస్తే నేను మా ఆయనకు చెప్పలేనా అని శ్రీవల్లి వెళ్లి చందు కి చెప్తుంది. అటు నర్మదా వెయిట్ చేస్తున్న కూడా నాన్న చెప్పిన మాట కోసం సాగర్ వెయిట్ చేసి రూమ్ కి వస్తాడు. నర్మదా సాగర్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్, చందులు పెళ్లాల కోసం గొడవ పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..