BigTV English

NTR: నీల్ సినిమా స్టార్ట్ చేయకుండా ఈ వరల్డ్ టూర్లు ఏంటి మావా?

NTR: నీల్ సినిమా స్టార్ట్ చేయకుండా ఈ వరల్డ్ టూర్లు ఏంటి మావా?

NTR: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనౌన్స్ చేసి ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందా? ఎప్పుడు ఎన్టీఆర్ ఇందులో జాయిన్ అవుతాడా? అనే ప్రశ్నలు అభిమానులను ఉత్కంఠలో ఉంచుతున్నాయి. ఇటీవల NTR31 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనా, ఎన్టీఆర్ మాత్రం ఇంకా సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. దీంతో, ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.


ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తి చేసుకున్నాకే, ప్రశాంత్ నీల్ సినిమాకి రెగ్యులర్‌గా హాజరవుతాడనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ ఇంకా ముందుకు జరగడం లేదు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌కి గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, దేవర ప్రమోషన్స్ కోసం కొరటాల శివతో కలిసి జపాన్ వెళ్లాడు. జపాన్ టూర్ నుంచి తిరిగిన తర్వాత, ఎన్టీఆర్ మళ్లీ ముంబై వెళ్లే అవకాశం ఉందని టాక్.

వార్ 2 సినిమా విషయానికి వస్తే, ఇంకా ఓ పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ షెడ్యూల్ పూర్తయ్యాకే ఎన్టీఆర్ తన NTR31 షూటింగ్‌లో జాయిన్ అవుతాడా? లేక మళ్లీ ఆలస్యం అవుతుందా? అనేది చూడాలి. ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతుండడంతో, ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్న టైమ్‌కి రిలీజ్ అయ్యే అవకాశమే లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి.


ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలు ఆలస్యం అయినా బిగ్ స్క్రీన్‌పై ఒక విజువల్ మాస్టర్‌పీస్‌గా మారాయి. ఇప్పుడు అదే విధంగా, NTR31 కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని టాక్. కానీ, సినిమా ఆలస్యం అవుతూనే ఉంటే ఫ్యాన్స్‌లో నిరాశ పెరిగే అవకాశం ఉంది. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో వైరల్ అవుతున్న ఈ మూవీ నీల్ కి డ్రీమ్ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ కి కూడా ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్… అందుకే మైత్రి మూవీ మేకర్స్ బడ్జట్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాపై ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ వార్ 2 మూవీ ప్రమోషన్స్‌లోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వార్ 2 రిలీజ్ అయిన తర్వాతే ప్రశాంత్ నీల్ మూవీ పూర్తిస్థాయిలో మొదలవుతుందా? లేక ఇంకెవ్వరికీ అర్థంకాని కారణాలతో మరింత ఆలస్యం అవుతుందా? అనేది చూడాలి. ఈ వెయిటింగ్‌కి పుల్‌స్టాప్ ఎప్పుడువేస్తారో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×