BigTV English

OTT Movie : ప్రేమించుకుంటున్నాం అని ఇంటికి వెళ్తే ఇంత అరాచకమా? సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ప్రేమించుకుంటున్నాం అని ఇంటికి వెళ్తే ఇంత అరాచకమా? సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ అదిరిపోయే ట్విస్ట్ లతో పిచ్చెక్కించే విధంగా ఉంటాయి అన్ని సినిమాలు అని చెప్పలేం కానీ కొన్ని సినిమాలైతే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇందులోనూ యాక్షన్, సస్పెన్స్, సైకలాజికల్ అంటూ రకరకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్, సస్పెన్స్ సినిమాలను చూస్తారు. కానీ సైకలాజికల్ థ్రిల్లర్ అనే కేటగిరీలో వచ్చే సినిమాలను మాత్రం చాలా అరుదుగా చూస్తారు. ఇక ఈ జానర్ లో వచ్చే కొన్ని సినిమాలైతే చూసి చాలా రోజులైనా మదిలో నుంచి అస్సలు పోవు. అలాంటి క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి ? అనే విషయాలను చూసేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో… 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో భయంతో చెమటలు పట్టించే విధంగా ఉంటుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎంత డిస్టర్బింగ్ గా ఉంటుందంటే హిప్నాటిజం చేసి ఓ మనిషిని ఇంత భయంకరంగా టార్చర్ చేస్తారా అని నోరు వెళ్ళబెట్టాల్సిందే.


కథలోకి వెళ్తే…

సాధారణంగా ఇండియాలో అయితే కులం, మతం అంటూ కొంతమంది కొట్టుకు చస్తారు. అలాగే విదేశాల్లో తెల్లజాతి నల్లజాతి అనేది అచ్చం మన దగ్గర కుల వివాదాలు జరిగినట్టుగానే జరుగుతాయి. స్టోరీలోకి వెళ్తే నల్ల జాతి కుర్రాడైన హీరోని ఒక తెల్ల జాతి అమ్మాయి లవ్ చేస్తుంది. అయితే ఇద్దరూ తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ పెళ్లి కావాలంటే పెద్దల ఆశీర్వాదం కావాలి కాబట్టి హీరోయిన్ పేరెంట్స్ ను కలిసి పెద్దల అంగీకారం తీసుకోవడానికి వెళ్తాడు హీరో. కానీ నల్ల జాతి వ్యక్తులు అంటే హీరోయిన్ ఫ్యామిలీకి చిన్న చూపు ఉంటుంది. పైగా ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. అయినప్పటికీ ప్రయత్నిద్దాం అన్నట్టుగా ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇక ప్రయాణం మధ్యలో ఒక నల్ల జాతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను అంటే మా ఫ్యామిలీ షాక్ అవడం ఖాయం అంటూ సరదాగా డైలాగ్లు వేస్తుంది హీరోయిన్. హీరో తన తండ్రితో చెప్పే హీరోయిన్ పేరెంట్స్ ను కలవడానికి వెళ్తాడు. ఆయన పోలీస్. మరోవైపు ప్రయాణం మధ్యలోనే కారు ప్రమాదం జరగగా, అక్కడికి వచ్చిన పోలీసులు ఇంటరాగేట్ చేసి పంపించేస్తారు. ఇక హీరోయిన్ ఇంటికి వెళ్ళగానే షాకింగ్ గా వాళ్ళు నార్మల్ గా రిసీవ్ చేసుకుంటారు. పైగా అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడే స్టొరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్లంతా నల్లజాతియులే కావడం హీరోని ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు హీరో తండ్రికి హీరోయిన్ ఊర్లో నల్లజాతీయులు ఎక్కువగా మిస్ అవుతున్న కేసులు నమోదు కావడం గురించి తెలుస్తుంది. ఇక్కడేమో హీరోయిన్ తండ్రి హీరోకి తెలియకుండానే ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతాడు. అసలు హీరోయిన్ నేటివ్ ప్లేస్ లో ఏం జరుగుతోంది? అతన్ని ఎందుకు హిప్నటైజ్ చేసి హింసించాలి అనుకుంటారు? చివరికి హీరో అక్కడ్నుంచి తప్పించుకున్నాడా ? అనే విషయాలు తెలియాలంటే ‘గెట్ అవుట్‘ అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×