Jagan convoy: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో మరో వ్యక్తి మృతిచెందాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి కింద పడిపోయాడు. బాధితుడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. కాగా ఈ రోజు ఉదయం కూడా జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని సంగయ్య అనే వృద్ధుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మృతిపై టీడీపీ స్పందించింది. జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇంత ప్రమాదం జరిగినా.. జగన్ కనీసం పట్టించుకోలేదని విమర్శించింది.
https://www.facebook.com/BIGTVLiveTelugu/videos/702005002431139/?rdid=suI0kwPmUdKkt4Cy
పల్నాడు జిల్లా రెంటపాళ్లకి మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఆయన టూర్‌కు పోలీసులు కండిషన్లతో ఓకే చెప్పిన నేపథ్యంలో.. జగన్ పర్యటన హైటెన్షన్ రాజేసింది. వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్తున్న విషయం తెలిసిందే. జగన్ పర్యటనతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనకు కేవలం వంద మందికి మాత్రమే అనుమతి ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో.. భారీగా జనసమీకరణ చేయవద్దని సూచించారు. మరోవైపు పోలీసులు విధించిన నిబంధనలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు.
ALSO READ: AP Govt Scheme: ఏపీలో వారికి తీపి కబురు.. లక్ష విలువ చేసే వాహనం
జగన్ పర్యటనపై వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని టీడీపీ అంటుంటే.. నాగమల్లేశ్వరరావు మృతికి వేధింపులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలంటూ పిలుపునివ్వడంతో ఇప్పుడు పల్నాడులో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
ALSO READ: YS Jagan Convoy: జగన్ కాన్వాయ్ ఢీకొని.. దళితుడు మృతి