BigTV English

Phone Tapping Case : వాళ్లనూ వదలని కేసీఆర్!.. ఫోన్ ట్యాపింగ్‌లో సంచలన పేర్లు..

Phone Tapping Case : వాళ్లనూ వదలని కేసీఆర్!.. ఫోన్ ట్యాపింగ్‌లో సంచలన పేర్లు..

Phone Tapping Case : వాళ్లూ వీళ్లు అని లేదు. మనోడా కాదా అనే డౌట్ అక్కర్లేదు. నెంబర్ దొరికితే చాలు ఫోన్లు ట్యాప్ చేసేసుడే అన్నట్టు సాగింది దారుణం. రాజకీయ నాయకుల నుంచి మీడియా అధినేతలు, జడ్జీలు, కలెక్టర్లు ఇలా ఎవరినీ వదిలిపెట్టలే. ఓటమి భయమో.. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆరాటమో.. కారణం ఏదైనా కానీ ఫోన్ ట్యాపింగ్ మాత్రం బీభత్సంగా చేసేశారు. పదులు, వందలు కాదు.. ఏకంగా 4,200 ఫోన్స్ ట్యాప్ అయ్యాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. లేటెస్ట్‌గా ABN ఆంధ్రజ్యోతి మీడియా అధినేత రాధాకృష్ణను సాక్షిగా గంట సేపు విచారించింది సిట్. ఆయన నుంచి కీలక సమాచారం సేకరించింది.


వాళ్లిద్దరూ వేరే లెవెల్

రాధాకృష్ణతో కేసీఆర్ స్నేహం శత్రుత్వం డిఫరెంట్‌గా ఉండేది. మొదట్లో వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. బావా బావా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం. కేసీఆర్‌ను రారా పోరా అనేంత చొరవ ఉండేదాయనకు. కేసీఆర్ రాజకీయ ఓనమాలు దిద్దే సమయంలో.. రాధాకృష్ణ ప్రముఖ జర్నలిస్ట్‌గా ఉండేవారు. టీడీపీ కవరేజ్ చేసేవారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన కేసీఆర్.. రాధాకృష్ణతో మంచి దోస్తానా చేశారు. అలా అలా ఎన్టీఆర్‌కు సైతం క్లోజ్ అయ్యారు. అప్పట్లో వాళ్లిద్దరి హవా మామూలుగా ఉండకపోయేదంటారు. అలా చాలా ఏళ్ల పాటు వారి స్నేహం నడిచింది. కేసీఆర్ చాలా ఖతర్నాక్ అని.. నిద్ర పోతూ కూడా ఆలోచిస్తారని రాధాకృష్ణ అనేవారు. అంతా బాగానే ఉన్నా.. కేసీఆర్ సీఎం అయ్యాక వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆంధ్రజ్యోతి టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా ఉంటోందనే కారణంతో.. ABNను తొక్కేయాలని చూశారు కేసీఆర్. ఓ ఇష్యూలో ఏకంగా ఆ ఛానెల్‌ను కొన్ని నెలల పాటు తెలంగాణలో బ్యాన్ కూడా చేశారు. అలా వారి మధ్య దూరం గొడవల స్థాయికి చేరింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో రాధాకృష్ణ పేరు కూడా ఉండటం అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదంటున్నారు. సిట్ విచారణ ఏకంగా గంట పాటు జరగడం చూస్తుంటే.. ఆయన నుంచి చాలా మేటరే బయటపడి ఉంటుందని అంటున్నారు.


V6 న్యూస్ ఛానెల్ సీఈవో అంకం రవి ఫోన్ సైతం ట్యాప్ అయింది. ఆ మీడియా అధినేత వివేక్ వెంకటస్వామితో బీఆర్ఎస్‌కు పెద్ద వైరమే ఉంది. కేటీఆర్ ప్రధాన అనుచరుడు బాల్క సుమన్ కోసం వివేక్‌ను పార్టీలో ఎదగనీయకుండా చేశారంటారు. కల్వకుంట్ల రాజకీయాలకు బలి అవుతానని గ్రహించి.. వివేక్ వెంకటస్వామి కారు దిగేశారు.

కొండాపై కొండంత అనుమానం

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరించారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కొండా.. కేసీఆర్ బాసిజం భరించలేక పార్టీని వీడారు. బీజేపీలో చేరారు. సొంత పార్టీ నేత వెళ్లిపోవడంతో ఆయన కూడా టార్గెట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్‌లో చేరిపోయినట్టున్నారు. గవర్నర్లుగా ఉ దత్తాత్రేయ, ఇంద్రాసేనారెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేసింది ప్రభాకర్ రావు అండ్ టీమ్. హుజురాబాద్, మునుగోడు బైపోల్‌‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌‌కు చెందిన 120 మంది నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.

4వేలకు పైగా ఫోన్లు ట్యాప్

కలెక్టర్లు, సీసీల నంబర్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. హైకోర్టు జడ్జి, ఆయన భార్య ఫోన్‌ కూడా ట్యాప్‌ అయినట్టు సిట్ గుర్తించింది. 16 మంది హైకోర్టు జడ్జ్‌ల ప్రొఫైల్స్‌ను కూడా సిద్ధం చేసినట్టు తేల్చారు. పలువురు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రభుత్వ అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. 618 మంది రాజకీయ నేతలు వారి అనుచరులకు నోటీసులు ఇచ్చి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనుంది సిట్.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×