Wife Kills Husband: ఇటీవల మేఘాలయ హనీమూన్ భర్త హత్య.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. కట్టుకున్న భర్తను కాటికి పంపేందుకు ఆ భార్య వేసిన స్కెచ్.. ఇండియా మొత్తం అవాక్కయ్యేలా చేసింది. హనీమూన్ పేరుతో.. భర్తను హనీ ట్రాప్ చేసిన ఆ నవ వధువే.. సీక్రెట్ కిల్లర్ అని తేలాక.. ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది మరువరక ముందే.. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు.. భర్తను చంపింది ఓ నవ వధువు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా పిన్నాపురంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్ అనే యువకుడు.. లైసెన్స్ సర్వేయర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈనెల 17వ తేదీ నుంచి తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు.
ఏదో పని మీద బయటకు వెళ్లి ఉంటాడులే.. వచ్చేస్తాడు అనుకుంటున్నారు అందరూ.. కానీ తన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో.. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబమంతా తమ తేజేశ్వర్ కోసం గాలిస్తుండగా.. కర్నూలు జిల్లా పిన్నాపురం సమీపంలోని.. గ్రామ శివారులో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వెలుగుచూసింది.
సమాచారం తెలుసుకున్న బంధువులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కాళ్లపారాణి ఆరక ముందే తమ కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో.. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. తేజశ్వర్ మే 18వ తేదీనా కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహ జరిగింది. ఇద్దరు ఇష్టపడే వివాహం చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు. వివాహం జరిగిన నెలరోజులు కూడా కాకముందే.. ఈ దారుణమైన ఘటన జరగడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు.. బంధువులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: చిక్కిన విదేశీ మహిళలు.. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అదుపులోకి, ఇంతకీ ఎవరు వీళ్లు?
అసలు తేజశ్వర్‌ను చంపింది ఎవరు? ఈ ఘటనకు కారణాలేంటి? అన్న వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తేజశ్వర్‌ను తన భార్యే చంపిందని ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందు ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నప్పటికీ.. ఆ యువతకీ వేరే అతనితో ఎఫైర్ ఉందని అనుమానిస్తున్నారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ కలిసి తేజేశ్వర్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. వాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. బ్యాంక్ మేనేజర్, ఐశ్వర్య ఫోన్లను ట్రేస్ చేసి వివరాలు సేకరించారు పోలీసులు. ఐశ్వర్య, అత్త సుజాతను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.