Mahabubnagar Crime News: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. దాని ఫలితంగా హత్యలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఈ లోకాన్ని వదిలిపెడుతున్నారు. పిల్లలుంటే అనాథలవుతున్నారు. తాజాగా తన భర్తతో ఓ మహిళ రొమాన్స్ చేస్తుందని భావించింది అతడి భార్య. ఆ మహిళను దారుణంగా చంపేసింది. చివరకు జైలు పాలయ్యింది. అసలేం జరిగింది?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ. ఆమె అసలు పేరు వెంకటమ్మ.. అందరూ బుజ్జమ్మ అని పిలుస్తారు. వయసు కూడా 36 ఏళ్లు. ఆమెకు 20 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి అయ్యింది. కర్ణాటకకు చెందిన రాజుతో పెద్దలు దగ్గరుండి పెళ్లి జరిపించారు. మొదట్లో ఈ దంపతులు బాగానే ఉండేవారు. ఏం జరిగిందో తెలీదు. ఇద్దరు మాటా మాటా పెరిగింది. ఆపై దూరం పెరిగింది.
చివరకు పెళ్లయిన రెండేళ్లకు భర్త నుంచి విడిపోయింది బుజ్జమ్మ. తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. మరి బుజ్జమ్మ మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంత గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్ షిప్ గా మారింది.
ఇద్దరు మనసులు కలిశాయి. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. సీన్ కట్ చేస్తే.. మొగులప్ప ఇదివరకు పెళ్లి అయ్యింది. అయినా బుజ్జమ్మతో క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టాడు. ఈ విషయమై మొగులప్పతో గొడవ పడింది భార్య లక్ష్మి. అయినా భర్త బుద్ధి మారలేదు. చివరకు మొగులప్ప.. బుజ్జమ్మతో వివాహేతర సంబంధం కంటిన్యూ చేశాడు.
ALSO READ: సిమెంట్ డ్రమ్ములో నేవీ ఆఫీసర్ శవం
ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది అతడి భార్య లక్ష్మి. భర్తను ఏమనలేక బుజ్జమ్మతో గొడవ పడింది లక్ష్మి. చీటికీ మాటికీ ఇరువురు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.
మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ వద్దకు ఆవేశంగా వెళ్లింది లక్ష్మి. ఆమె రావడాన్ని గమనించిన బుజ్జమ్మ సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి లోపలికి రాకుండా గేటుకు తాళం వేయించింది. అయినప్పటికీ ముళ్ల పొదలను దాటుకుని నర్సరీలోకి వెళ్లింది లక్ష్మి. ఇరువురు మధ్య గట్టిగానే గొడవ జరిగింది.
పట్టరాని కోపంతో బుజ్జమ్మ తలపై బలంగా రాయితో మోదింది. చివరకు రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నర్సరీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.