Woman Kills Boyfriend Daughter| ప్రేమ గుడ్డిది అని అంటారు. కానీ అసూయతో పసిప్రాణాలు కూడా తీయగలదు అని నిరూపించింది ఓ సైకో లేడీ. తను పెళ్లి చేసుకోబోయే యువకుడితో తాను మాత్రమే ఉండాలని అతని చిన్నారి కూతురిని హత్య చేసింది. ఆ తరువాత అమాయకంగా ఏం జరిగిందో తనకు తెలియదు అని పోలీసుల ముందు నటించింది. ఈ ఘటన అమెరికా లో జరిగింది.
వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాలిఫోర్నియా లో టిషాల్ ఎలైస్ మార్టిన్ అనే 34 ఏళ్ల మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నివసిస్తోంది. అయితే ఆమె ప్రియుడికి ఇంతకుముందు వివాహంతో కలిగిన ఓ కూతురు ఉంది. ఆ పాప పేరు జమారియా. జమారియాకు 9 ఏళ్ల వయసు. అయితే జమారియా తల్లి విడాకులు తీసుకొని రెండో వివాహం చేసుకోవడంతో జమారియా కొన్ని నెలల క్రితం తండ్రితో నివసిస్తోంది.
జమారియా తన ఇంట్లో ఉండడం టిషాల్ కు అసలు ఇష్టం లేదు. అందుకే తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో పాపను చిత్రహింసలు పెట్టేది. గోడ కేసి కొట్టడం, వస్తువుల విసిరేసి జమారియాను కొట్టడం,.. తరుచూ పాపను అసభ్య పదాలతో తిట్టడం చేస్తూ ఉంటుంది. పైగా తండ్రితో చెబితే చంపేస్తానని బెదిరిస్తుంది.
ఈ క్రమంతో ఒక రోజు జమారియాను చంపేద్దామని నిర్ణయించుకొని ఇంట్లో ఉన్న రాట్ వీలర్ జాతికి చెందిన కుక్కను జమారియాపై దాడి చేయమని ఉసిగొల్పింది. అది తెలియక అమాయకంగా ఆడకుంటున్న జమారియాపై ఆ కుక్క తన బలమైన పళ్లతో కొరికి కొరికి గాయాలు చేసింది.
అయినా జమారియా చనిపోలేదు. కిందపడి కొద్ది కొద్దిగా ప్రాణాలు వదులుతోంది. అది కూడా సహించని టిపాల్.. వెనుక నుంచి వచ్చి తలపై బలంగా ఒక రాడ్డుతో కొట్టింది. అంతే పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఇదంతా జరిగాక పోలీసులకు తానే ఫోన్ చేసి .. ఏం జరిగిందో తనకు తెలియదు.. ఇంట్లో పాప చనిపోయి ఉందని సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసి పాప తండ్రి కూడా అక్కడికి చేరుకున్నాడు. పోలీసుల విచారణ సమయంలో తనకేమీ తెలియదు.. తను ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగిందని తెలిపింది టిషాల్.
అయితే తాను ఒక్కటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడు. అదే టిషాల్ విషయంలో జరిగింది. జమారియా తండ్రి కొన్ని రోజుల క్రితమే ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టాడు. పోలీసులకు ఈ విషయం తెలిసి ఆ కెమెరాల వీడియో రికార్డింగ్ చూశారు. అందులో టిషాల్ కుక్కను పాపపై దాడి చేయమని సైగ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా గత కొన్ని రోజులుగా పాపను టిషాల్ చిత్రహింసలు పెట్టిన దృశ్యాలు కూడా పోలీసులు చూశారు.
పోలీసులు జమారియా హత్య కేసులో టిషాల్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?