BigTV English

Bigg Boss 8 Prize Money: షాకింగ్.. ‘బిగ్ బాస్’ ప్రైజ్ మనీ ఇంతేనా? దిమ్మతిరిగే ట్విస్ట్

Bigg Boss 8 Prize Money: షాకింగ్.. ‘బిగ్ బాస్’ ప్రైజ్ మనీ ఇంతేనా? దిమ్మతిరిగే ట్విస్ట్

Bigg Boss 8 Prize Money: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో వేచి చూసిన రోజులు రానే వచ్చాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘బిగ్‌బాస్ 8’ తెలుగు రియాల్టీ షో సెప్టెంబర్ 1న అత్యంత గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయింది. ఇక ఈ సీజన్ 8కు అక్కినేని నాగార్జునే హైస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ షో ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రారంభం అయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ప్రతి సీజన్‌లోనూ ఒక్కో కంటెస్టెంట్‌ని హౌజ్‌లోకి పంపేవారు. కానీ ఈ సారి మాత్రం జంటలుగా పంపించారు.


హౌజ్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లను పంపగా.. అందులో ఏడుగురు అమ్మాయి.. ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇవ్వకుండా, జంటలుగా ఎంట్రీ ఇచ్చి మొదటే షాక్ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగానే కింగ్ నాగార్జున తన మాస్ ఎంట్రీతో దుమ్ముదులిపేశాడు. బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్‌లో చాలా ఎనర్జిటిక్‌గ అమ్మాయిలతో ‘దేవర’ మూవీలోని సాంగ్‌కు మాస్ స్టెప్పులేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గుబురు గుబురు గడ్డంతో కనిపించి ఆడియన్స్ మనసు దోచుకున్నాడు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ జంటగా ఎంట్రీ ఇచ్చారు. ముందుగా యష్మీ గౌడ్ – నిఖిల్ మిలియక్కల్, అభయ్ నవీన్ – ప్రేరణ, హీరో ఆదిత్య – సోనియా, బేబక్క – శేఖర్ భాషాలు ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశారు. కాగా ఈ సారి లాంచ్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్టుల లిస్టు చాలానే ఉండగా.. మరోవ్యక్తి కూడా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. ఆయన ఎంట్రీ ఇస్తూనే గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అందించాడు. అందులో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆమె మాత్రం 10 వారాలు ఉంటారంటూ బేబక్క గురించి చెప్పుకొచ్చాడు. అదే సమయంలో బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. తొలి రోజున ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు.


Also Read:  హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్.. ఎవర్రా మీరంతా అనుకుంటే.. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ఇందులో భాగంగానే నాగమణిని ఎలిమినేట్ చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా నాగమణి కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ఇదంతా నిజమే అనుకున్న వారంతా ఫూల్ అయ్యారు. ఎందుకంటే ఇదంతా ప్రాంక్ భయ్యా అంటూ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.

అయితే ఇదంతా ఒకెత్తయితే.. ‘బిగ్ బాస్’ సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎక్కువగా సీరియల్ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లే ఉన్నారు. ఒక్క ఆదిత్య ఓం, విష్ణు ప్రియ మినహా మిగతావారంతా పెద్దగా పేరులేని కంటెస్టెంట్‌లే. దీంతో ప్రేక్షకులు కూడా కంటెస్టెంట్స్‌ను చూసి పెదవి విరుస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ‘బిగ్ బాస్’ సీజన్ 8కు సంబంధించిన ప్రైజ్ మనీ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ప్రైజ్ మనీ ప్రకటిస్తామని బిగ్ బాస్ ఊరించాడు. అయితే, ‘సున్నా’ మాత్రమే చూపించడంతో కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు.

ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత?

గత సీజన్స్‌లో ప్రైజ్ మనీ రూ.50 లక్షలు ఉండేది. అయితే, ఈ సారి మాత్రం ప్రైజ్ మనీ ప్రకటించలేదు. సీజన్ 8 కాన్సెప్ట్ ఇన్ఫినిటీ కాబట్టి.. ప్రైజ్ మనీ కూడా ‘లిమిట్ లెస్’ అని ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి, అంతా బాగా ఆడాలని చెప్పాడు బిగ్ బాస్. ఇలా మొత్తంగా తొలి రోజు సందడి సందడిగా సాగిపోయింది.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×