Rajasthan News: మూడేళ్ల కూతురు ఆ కన్న తల్లికి భారమైంది. ప్రియుడు చెప్పిన మాటలను నమ్మేసింది. ఆ క్షణం కన్న కూతురని చూడకుండా రాక్షసుడిగా మారిపోయింది. నిద్రపోతున్న చిన్నారిని సరస్సులో విసిరేసింది. సంచలనం రేసిన ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. అందుకు కారణలేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల అంజలికి పెళ్లి అయ్యింది. భర్త నుండి విడిపోయిన తర్వాత ఆమె రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. అజ్మీర్‌లోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేసే అల్కేష్‌తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మనసులు కలిశాయి. ఆ తర్వాత సహజీవనం మొదలు పెట్టింది ఈ జంట.
తమ ఏకాంతానికి చిన్నారి అడ్డుగా ఉందని, ఇది కరెక్టుకాదని ప్రియుడు అంజలికి చెప్పాడు. దీంతో ఏం చెయ్యాలో అనే దానిపై పలు విధాలుగా చర్చించుకున్నారు. చివరకు చిన్నారిని సరస్సు విసిరేయడం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. విధులు ముగించుకున్న తర్వాత మంగళవారం రాత్రి అజ్మీర్‌లోని అన్నాసాగర్ లేక్ వద్దకు తీసుకొచ్చింది అంజలి. మూడేళ్ల కూతురితో కబుర్లు చెప్పింది.
ఆ తర్వాత జోలపాట పాడి నిద్ర పుచ్చింది. బిడ్డను సరస్సు దగ్గరకు తీసుకెళ్లి అందులో విసిరేసింది. ఆ తర్వాత తన కూతురు తప్పిపోయినట్లు కొత్తగా డ్రామా క్రియేట్ చేసింది. మంగళవారం రాత్రి గస్తీ తిరుగుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ గోవింద్ శర్మ రోడ్డుపై ఈ జంటను చూసి ప్రశ్నించారు. ఈ సమయంలో ఇక్కడేమి చేస్తున్నారని, ఎందుకున్నారని పలు ప్రశ్నలు సంధించాడు.
ALSO READ: కోకాపేట్ లో దారుణం.. భర్తని చంపేసిన భార్య
తన కుమార్తెతో కలిసి ఇంటి నుండి బయలుదేరానని, మార్గమధ్యలో అదృశ్యమైందని చెప్పిందని కొత్త డ్రామా మొదలుపెట్టింది. రాత్రంతా చిన్నారి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కూతుర్ని చేతుల్లో ఎత్తుకుని అనా సాగర్ సరస్సు చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు.
కొన్నిగంటల తర్వాత ఆ మహిళ ఒంటరిగా మొబైల్ ఫోన్‌లో బిజీగా కనిపించింది. ఆ దృశ్యాలు ఆమె మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. బుధవారం సరస్సులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత అంజిలిని ప్రశ్నించగా చేసిన నిజాన్ని ఒప్పుకుంది.
అల్కేష్ తన బిడ్డ గురించి ఎగతాళి చేసేవాడని, ఆ కారణంగా ఆ విధంగా చేశానని ప్రియుడిపై తోసింది అంజలి. కేసు నమోదు చేసి ఆమెని అరెస్టు చేశారు. చిన్నారి హత్యలో అల్కేష్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో కొత్తగా ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.