Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ ఈసారి సీజన్ 9 అంటూ సెప్టెంబర్ 7వ తేదీన చాలా ఘనంగా ప్రారంభం అయింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. కామనర్స్ కేటగిరీలో 6 మంది హౌస్ లోకి వచ్చారు. నిజానికి ఈసారి కామనర్స్ ను ఎక్కువగా తీసుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 20 వేలకు పైగా అప్లికేషన్లు సామాన్యుల నుంచి రాగా.. వారి నుంచి ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. అందులో 13 మందిని ఫైనల్ గా.. అగ్నిపరీక్ష అనే షో నిర్వహించి పలు టాస్క్లతో ఎంపిక చేయడం జరిగింది. వారిలో ఆరు మందిని ఇప్పుడు హౌస్ లోకి పంపించారు.
6 మంది కామనర్స్ ను ఓనర్స్ గా ప్రకటించిన బిగ్ బాస్.. సెలబ్రిటీలను టెనెంట్స్ గా విడదీసి టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే టెనెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే బిగ్ బాస్ పెట్టే పరీక్షను నెగ్గాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెయిన్ హౌస్ లోకి వెళ్లడానికి టెనెంట్స్ మధ్య పోటీ నిర్వహించగా.. ఇందులో సెలబ్రిటీలు పడిన గొడవ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా సుమన్ శెట్టిపై నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఇంకొంతమంది అది గేమ్ ఇందులో ఆడ , మగ తేడా లేదు అంటూ కూడా మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం. మరి ప్రోమో ఏంటో ఇప్పుడు చూద్దాం.
హౌస్ లోకి వెళ్లేది ఎవరు?
తాజాగా 12వ రోజుకి సంబంధించిన మొదటి ప్రోమో ను విడుదల చేశారు. భరణి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గురించి వివరిస్తూ…” ఈ వారం టెనెంట్స్ లో ఒకరికి ఓనర్స్ గా మారి బిగ్ బాస్ మెయిన్ హౌస్ లో అడుగుపెట్టడానికి మరో అవకాశం ఇస్తున్నాము . ఓనర్స్ విసిరిన ఐటమ్స్ ను పట్టుకొని ఎండ్ బజర్ మోగేలోపు వాటిని తమ బాస్కెట్ లో భద్రంగా దాచుకోవాలి. అంటూ టాస్క్ గురించి వివరిస్తారు. ఇక తర్వాత మనీష్, దమ్ము శ్రీజ బాస్కెట్ లోని బొమ్మలను విసురుతూ ఉండగా.. సెలబ్రిటీలు వాటిని పట్టుకొని తమ బాస్కెట్ లో వేసుకుంటారు.
ఇంతలా కొట్టుకుంటున్నారు ఏంటి?
అంతా బాగున్నా.. ఇక ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బాస్కెట్లో ఉన్న బొమ్మలను వారు సేఫ్ గా కాపాడుకోవాలని బిగ్ బాస్ ముందే టాస్క్ వివరించిన విషయం తెలిసిందే. అయితే వీరు మాత్రం ఇంకొకరి బాస్కెట్ లో ఉండే బొమ్మలను తీసుకొని తమ బాస్కెట్ లో వేసుకుంటూ నానా రభస చేశారు. ముఖ్యంగా సుమన్ శెట్టి ఫ్లోరా షైనీ , సంజన బొమ్మలు తీసుకోవడానికి వస్తే.. తన చేతులతో వారిని కొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో కొంతమంది ఆడవారిపై ప్రతాపం ఏంటి అని కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఆయన తన బొమ్మలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఆయన తప్పులేదు.. ఇక్కడ గేమ్ ఆడ కాదు మగా కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ప్రోమో చాలా హీట్ ఎక్కించిందని చెప్పవచ్చు.
ALSO READ:RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!