E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కడదాకా ఉండాల్సిన ఇల్లాలు.. కసాయిగా మారింది.. వివాహేతర సంబంధం చిచ్చు.. దేవరకద్ర మండలంలో దారుణం!

కడదాకా ఉండాల్సిన ఇల్లాలు.. కసాయిగా మారింది.. వివాహేతర సంబంధం చిచ్చు.. దేవరకద్ర మండలంలో దారుణం!
Advertisement

Mahabubnagar crime: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఏడడుగులు నడిచి, కష్టసుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసిన ఆ ఇల్లాలే కసాయిగా మారింది. కట్టుకున్న భర్తపై ఏమాత్రం కనికరం చూపకుండా.. చీరతోనే అతని చేతులు కట్టేసి అతి కిరాతకంగా నరికి చంపిన అత్యంత అమానవీయ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపింది. క్షణిక సుఖం కోసం విచక్షణ కోల్పోయిన ఓ మహిళ చేసిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేయడమే కాకుండా, మానవ సంబంధాల ఉనికినే ప్రశ్నించేలా చేస్తోంది.

స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరు నాగేశ్ (38)కు, కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కవితతో సుమారు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. అంతా సాఫీగా సాగిపోతున్నదనుకున్న సమయంలో భార్య కవిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త నాగేశ్ దృష్టికి రావడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అయినా ఆమె తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన నాగేశ్ మద్యం తాగి వచ్చి రోజూ భార్యతో ఘర్షణ పడేవాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో కుమారులు గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి కవిత తన పైశాచికత్వాన్ని బయటపెట్టింది. నిద్రిస్తున్న నాగేశ్ చేతులను తన చీరతోనే గట్టిగా కట్టేసి, కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగింది. అయితే, అదే సమయంలో నిద్రలేచిన చిన్న కుమారుడు.. కళ్లెదుటే తండ్రిపై తల్లి చేస్తున్న దాడిని చూసి భయంతో కేకలు వేశాడు. ఆ బాలుడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని, లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. నాగేశ్ రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.

తీవ్రంగా గాయపడిన నాగేశ్ ను స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున నాగేశ్ కన్నుమూశాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కటకటాల పాలు కానుండటంతో ఆ ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. మృతుడి సోదరుడు రాజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, పసిపిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసిందని స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు.

Advertisement

Also Read: జర్మనీలో కాల్పుల కలకలం.. ఒకే ఒక్క గొడవ, ఆరు ప్రాణాలు గాల్లోకి!

Related News

హోమ్‌ స్టేలో ఏం జరిగింది? ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి, ప్రియుడు మాటేంటి?

పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!

కృష్ణా జిల్లాలో ఘోరం.. బైక్‌కు కట్టేసి.. చెరువులో మామ, అల్లుడి మృతదేహాలు!

Hyderabad Drugs: లైవ్ లొకేషన్లతో డెడ్ డ్రాప్ డ్రగ్స్ దందా కలకలం..!

జైపూర్‌లో విషాదం.. రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి!

Illegal Bakery: గడువు ముగిసి కుళ్లిన పదార్ధాలతో బేకరీ దందా.. ఇద్దరు అరెస్ట్..!

మేం కొనాలనుకున్న ఇల్లు నువ్వెలా కొంటావ్? హైదరాబాద్‌లో గృహప్రవేశం ఇంటిపై మూకదాడి, రక్తసిక్తమైన శుభకార్యం!

Big Stories

×