Gajlaxmi Rajyog 2025: ఆగస్టు 4, 2025 చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైనదంటే.. ఒకటి కాదు, అనేక శుభ యోగాలు ఒకే రోజున ఏర్పడనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు.
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు 4న సంపద, వైభవం, అందానికి చిహ్నంగా ఉన్న మిథునరాశిలో గురువు, శుక్రుడి కలయిక కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో పాటు, సూర్యుడు, గురువు స్థానం ద్వారా ద్విద్ధశ యోగం కూడా ఏర్పడుతుంది. ఇది అదృష్టం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మాత్రమే కాదు.. సూర్యుడు కర్కాటకంలో ఉండి బుధుడితో కలిసిన తర్వాత, బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది తెలివితేటలు, నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ శుభ యోగాలన్నింటి కారణంగా.. ఈ రోజున అనేక రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి:
ద్విద్వాదశ యోగం ఏర్పడటం వల్ల ఈ యోగంచాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు ఊతం ఇవ్వబోతోంది. ఇప్పటివరకు పదే పదే నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావడం ప్రారంభమవుతుంది. అలాగే.. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. శివుని ఆశీస్సులతో.. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందడం ప్రారంభిస్తారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శాంతి ఉంటాయి. ఇంట్లో జరుగుతున్న పరస్పర విభేదాలు లేదా సమస్యలు ఇప్పుడు తొలగిపోవడం ప్రారంభమవుతుంది. తోబుట్టువులతో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. అంతే కాకుండా పరస్పర సహకారం పెరుగుతుంది. ఈ సమయంలో చేసిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. అంతే కాకుండా లాభదాయకంగా ఉంటాయి.
కన్యా రాశి:
గురువు, సూర్యుడి ద్విద్వాదశ యోగం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది,.ముఖ్యంగా చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కుటుంబంతో సంబంధాలు కూడా బలపడతాయి. అంతే కాకుండా పరస్పరం సమయం యొక్క నాణ్యత పెరుగుతుంది. మీరు విదేశాలకు సంబంధించిన ఏదైనా పనిలో ఉంటే లేదా విదేశీ పర్యటనకు ప్రణాళికలు వేస్తున్నట్లయితే.. అక్కడ నుండి కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పని ప్రశంసించబడుతుంది. అంతే కాకుండా నాయకత్వ లక్షణం ఉద్భవిస్తుంది, దీని కారణంగా మీరు కొత్త బాధ్యతలు, ఉన్నత స్థానాన్ని కూడా మీరు పొందవచ్చు. జీతం పెరుగుదల , పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి.
తులా రాశి:
మీ జీవితంలో కొత్త ఆనందం ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా మీరు చాలా కాలంగా ఏ పని చేస్తున్నా, ఇప్పుడు విజయం స్పష్టంగా కనిపిస్తుంది. చట్టపరమైన విషయాలలో చిక్కుకున్న వ్యక్తులు ఉపశమనంతో ఉంటారు. ఎందుకంటే కోర్టు సంబంధిత విషయాలలో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీ ప్రతిష్ట పెరిగే సంకేతాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇది సమాజంలో లేదా ఆఫీసుల్లో మీ గుర్తింపు, గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుకుంటే.. తండ్రితో ఏదైనా దూరం ఉంటే, దానిని ఇప్పుడు అధిగమించవచ్చు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం చూస్తున్న వారి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి.

Share