BigTV English

Trump vs Elon Musk: ట్రంప్ మస్క్ డిష్యుం డిష్యుం..! ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటంటే..

Trump vs Elon Musk: ట్రంప్ మస్క్ డిష్యుం డిష్యుం..! ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటంటే..

Trump vs Elon Musk: ఒకే ఒక్క క్రెడిట్ ట్వీట్‌తో మొత్తం టర్న్ తిప్పేశాడా? ఎంతైనా.. బిజినెస్ మెన్ బిజినెస్ మెన్నే అనిపించాడా? మొన్నటి వరకూ ఆ బిల్లు ఆమోదిస్తే కొత్త పార్టీ పెట్టేస్తానంటూ.. విరిచుకుపడ్డ.. మస్క్.. ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడేంటి? పైపెచ్చు ట్రంప్ ని మెచ్చుకుంటూ బిస్కెట్లు వేస్తున్నాడేంటి? అసలేం జరుగుతోంది వీరి మధ్య. ఈ టాక్- ఆఫ్- వార్ లో.. ట్రంప్ గెలిచినట్టా.. మస్క్ ఓడినట్టా? అసలేంటీ ఇద్దరి మధ్య వివాదం?


మొన్నటి వరకూ ట్రంప్ అంతు చూస్తా అన్న మస్క్

ఎక్కడ నెగ్గాలో కాదు- ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అతి పెద్ద పొలిటీషియన్. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే వ్యక్తి మరెవరో కాదు.. ఎలాన్ మస్క్. మొన్నటి వరకూ ట్రంప్ అంతు చూస్తానన్నవాడు కాస్తా.. ప్రెజంట్ ట్రంప్ ఈజ్ ద బెస్ట్ అనేస్తున్నాడు. అదేంటని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో వివాదాలను ట్రంప్ పరిష్కరించారు కాబట్టి.. ఆయనకా క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ ఓ ట్వీట్ బిస్కెట్ వేశాడు మస్క్. మరి మస్క్‌తో పెట్టుకుంటే మాములుగా ఉండదని అంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. అసలీ ట్వీట్ ఇప్పుడే ఇలా ఎందుకొచ్చింది? దీని బ్యాగ్రౌండ్ ఏంటని చూస్తే.. గాజాలో అరవై రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుందంటూ ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ మస్క్ మార్క్ మస్కా- చెస్కా ట్వీట్ వచ్చింది.


క్రెడిట్ ఇవ్వాల్సిన చోట.. క్రెడిట్ ఇవ్వాల్సిందే-మస్క్

క్రెడిట్ ఇవ్వాల్సిన చోట క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ మస్క్ చేసిన ఈ ట్వీట్ ప్రెజంట్ వీరిద్దరి మధ్య ఉన్న గొడవ ఎలాంటి స్థితిలో ఉందో ఎత్తి చూపుతోంది. ప్రస్తుతం ట్రంప్- మస్క్ మధ్య వివాదం ఎక్కడి వరకూ వచ్చిందంటే.. మస్క్ తన దుకాణం సర్దేసుకుని దక్షిణాఫ్రికా వెళ్లాల్సి రావచ్చని హెచ్చరించేంత. ఒక రోజు తర్వాత ఈ కూల్ ట్వీట్ వచ్చింది. ట్రంప్ కి ప్రోగా మస్క్ ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్ ఇదే. మస్క్ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరమేంటి? అంత ఘాటైన వ్యాఖ్యలు ట్రంప్ ఎందుకు చేసినట్టని చూస్తే.. మస్క్ గత ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయక ముందే.. తాను EVలకు పూర్తి వ్యతిరేకిననీ.. ఈ విషయం మస్క్ కి కూడా తెలుసునని అంటారు ట్రంప్. దానికి తోడు ప్రపంచంలో ఏ వ్యక్తికీ దక్కనన్ని రాయితీలు మస్క్ కి దక్కాయనీ.. ఇవేవీ లేక పోయి ఉంటే మస్క్ ఎప్పుడో సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చేదని అన్నారు ట్రంప్. ఎప్పుడైతే ట్రంప్ నుంచి ఈ తరహా స్పందన వచ్చిందో.. తాను కూడా టెంప్ట్ అయ్యానని అంటారు మస్క్. కారణమేంటంటే ఇదే ట్రంప్ మస్క్ కోపరేషన్ లేకుంటే తాను గెలిచేవాడ్ని కానని అనడం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి తాను ఈ వివాదాలకు దూరంగా ఉంటానని అన్నారు మస్క్. తర్వాత ఇదిగో ఈ ట్వీట్ తో తాను యూ టర్న్ తీసుకున్నట్టు ఎస్టాబ్లిష్ అయ్యారు.

DOGE సలహాదారుగా ఎన్నికైన మస్క్

గత ఎన్నికల్లో ట్రంప్ కి వేల కోట్ల డాలర్ల విరాళం ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు మస్క్. అంతే కాదు.. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ కి సలహాదారుగా ఎన్నికయ్యాక.. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా వచ్చిన వ్యతిరేకత.. ఆయన కంపెనీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టెస్లా షోరూములపై దాడులు జరగటం మాత్రమే కాదు షేర్ల ధరలు కూడా పడిపోయాయి. దానికి తోడు తన స్నేహితుడ్ని నాసా చీఫ్ గా చేయాలనుకున్నాడు. అదీ ఎదురు తగిలింది. గోరు చుట్టు మీద రోకలి పోటులా.. బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో తాను పూర్తిగా నష్టపోతానని గుర్తించిన మస్క్ దీనికి వ్యతిరేకంగా నినదించడం స్టార్ట్ చేశారు. ఈ బిల్లు దేశాన్ని అప్పుల పాలు చేసేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒక సమయంలో మస్క్ ఎక్కడి వరకూ వెళ్లారంటే బిగ్ బిల్ గానీ సెనెట్ లో పాసైతే.. తాను పార్టీ పెట్టడం ఖాయమని అనే వరకూ వచ్చేశారు. డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు ప్రత్యామ్నయంగా ఒక పార్టీ అవసరమని అంటూ.. ద అమెరికా పార్టీ అంటూ పేరు కూడా ప్రకటించారు మస్క్. ఎట్టకేలకు బిల్లు పాస్ కావడంతో.. ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. మస్క్ పార్టీ పెట్టడం సంగతి అటుంచితే ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారంచెలరేగేలా చేశాయి.

అందుకే అనుకూల ట్వీట్ పోస్ట్ చేసిన మస్క్.. అన్న చర్చ

ఇంతలో తేరుకున్న మస్క్.. ట్రంప్ కి అనుకూలంగా ట్వీట్ చేశారు. ట్రంప్ ని కొన్ని విషయాల్లో తప్పక మెచ్చుకోవల్సిందేననీ.. ఆయన ప్రపంచ వ్యాప్తంగా అలుముకుని ఉన్న కొన్ని వివాదాలనైతే పరిష్కరించారనీ రాసుకొచ్చారు. దీంతో మస్క్ భయపడ్డారనీ.. దేశ బహిష్కరణ ఎక్కడ ఎదుర్కోవల్సి వస్తుందో అన్న కోణంలో ఆయన యూటర్న్ తీసుకున్నారన్న చర్చకు తెరలేచింది. ట్రంప్ మస్క్ మధ్య గొడవలు.. భార్యాభర్తలకన్నా ఘోరంగా ఉంటాయా? ఇద్దరి మధ్య ఈ వివాదాలు ఈ నాటివి కావా? ఈక్రోనాలజీ.. ఎంతో సుదీర్ఘమైనదా? 2016 నుంచి 2025 వరకూ సుమారు 9 ఏళ్ల పాటు వీరి మధ్య ఉప్పు- నిప్పు వ్యవహార శైలి ఎలాంటిది? నాటి వరకూ నేటి నుంచి జరిగిన పరిణామ క్రమాలు ఎలాంటివి ఇప్పుడు చూద్దాం.

నీ శత్రువు ఖచ్చితంగా నా శతృవే- మస్క్

ట్రంప్, మస్క్.. ఓ నాన్ స్టాప్ నోస్టాల్జియా. అందుకే వీరిద్దరి మధ్య గల అనుబంధాన్ని బ్రొమాన్స్ గా అభివర్ణిస్తారు కొందరు. ఈ ఇద్దరూ ప్రేమికుల్లా కాసేపు ప్రేమ పంచుకుని, మరి కాసేపు బ్రేకప్.. ఇలా కొనసాగుతూనే ఉంటారని అంటారు. అందుకే ది ఇండిపెండెంట్.. వీరి గురించి చెబుతూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తుల మధ్య తీవ్రమైన ప్రేమగా అభివర్ణించింది. ట్రంప్ కోసం మస్క్ చేసిన త్యాగాలు మరువలేనివి. ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ అనే బాపతు. అంతే కాదు.. నీ మిత్రుడు నా మిత్రుడవుతాడో లేడో తెలీదు కానీ నీ శతృవు ఖచ్చితంగా నా శతృవేనంటారు మస్క్. గతంలో ట్రంప్ ఓడిపోవడానికి గల కారణం.. ట్విట్టర్. ఒక దశలో ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది ట్విట్టర్. దీంతో ఆయన్ను నైతికంగా దెబ్బ తీసిందీ సోషల్ మీడియా సంస్థ. ఇదే బైడెన్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిందని అంటారు. ట్రంప్ ఓటమికి కారణం ట్విట్టర్ అని తెలిసిన మస్క్.. దాన్ని కొనుగోలు చేసి ఎక్స్ అన్న పేరు కూడా మార్చేశారు. తిరిగి ట్రంప్ అకౌంట్ ని రియాక్టివేట్ చేశారు. అలా గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ చేసిన సాయం అంతా ఇంతా కాదు..

కమలా హారిస్ పై తీవ్ర స్థాయిలో మస్క్ విమర్శలు

లాస్ట్ ఎలెక్షన్స్ లో.. డెమోక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మస్క్. ఇది ట్రంప్ విజయావకాశాలను ఎంతగానో ప్రభవితం చేసిందని అంటారు. అందుకు ప్రతిగా ట్రంప్ డోజ్ లో మస్క్ కి కీలక బాధ్యతలను అప్పగించారు. ఎప్పుడైతే మస్క్ తన మిత్రుడైన ట్రంప్ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారో.. ఆనాటి నుంచి ఆయనకు ఎదురు దెబ్బలు తగలటం మొదలైంది. దీంతో ఆయనకు ఒక రకమైన విరక్తి భావన రావడం స్టార్టయ్యింది. అంతే కాదు, ట్రంప్ ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న చందంగా వ్యవహరించారు. ఉన్న సమస్యలు చాలవనుకుంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒకటి తీసుకురావడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకూ వచ్చింది. అచ్చ తెలుగులో చెబితే అతి పెద్ద అందమైన బిల్లుగా పేరున్న ఈ బిల్లును అసహ్యకరమైనదిగా చెప్పుకొస్తారు మస్క్. ఇది అమెరికాలో ఆర్ధిక సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తుందని అంటారాయన. ఇది ప్రభుత్వ అధిక నియంత్రణకు ఆస్కారం ఏర్పరుస్తుందని అంటారు మస్క్. దీని వల్ల తనలాంటి వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకూ సమస్యాత్మకంగా మారుతుందని అంటారాయన. ఇది ఖర్చు తగ్గించేది కాదు- అప్పు పెంచేదని అంటారు మస్క్.

ఈ బిల్లు పాస్ అయితే పార్టీ పెడతానన్న మస్క్

ఈ బిల్లు వ్యతిరేకత ద్వారా మస్క్ ఎక్కడి వరకూ వెళ్లిపోయారంటే ఇదిగానీ, పాసైతే తాను ఒక పార్టీ పెడతానని అన్నారు మస్క్. దీంతో అసలైన ఈవీ అస్త్రం ప్రయోగించారు ట్రంప్. మస్క్ అమ్మకాలు సాగిస్తోన్న.. ఎలక్ట్రిక్ వాహనాలను తాను ఎంత మాత్రం అంగీకరించనని. ఈ విషయం మస్క్ కి కూడా తెలుసని అంటారు. కారణం ఈవీలు ఎప్పుడైతే తెరపైకి వస్తాయో.. అప్పుడు పెట్రోలు ప్రభావం తగ్గుతుంది. పెట్రోలు చుట్టూ తిరిగే ప్రపంచ ఆర్ధిక రాజకీయం క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే పెట్రో డాలర్లు అమెరికాకు అతి పెద్ద ఆదాయ వనరు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కారణంగా.. పెట్రోలు డిమాండ్ తగ్గుతుందో అప్పుడు అమెరికా ఆర్ధిక పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. కారణమేంటంటే.. గల్ఫ్ దేశాల పెట్రోడాలర్లు భారీ ఎత్తున అమెరికన్ ట్రెజరీ నిల్వ చేసి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ తగ్గినపుడు ఈ డాలర్ డిపాజిట్లు పూర్తిగా కరిగిపోతాయి. ఇది ఎంత మాత్రం అమెరికాకు శ్రేయస్కరం కాదన్నది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. కేవలం ట్రంప్ మాత్రమే కాదు.. ప్రతి అధ్యక్షుడిదీ ఇదే ఆలోచన.

మస్క్ వ్యాపారాలకు రాజకీయంగా ఎన్నో సమస్యలు

దీంతో ఈ ఇద్దరి మధ్య తెలీకుండానే ఒక రకమైన వైరం ఏర్పడింది. కొంత కాలంగా తన వ్యాపారానికి రాజకీయంగా సమస్యలు ఎదురు కావడంతో.. ట్రంప్ కార్డ్ వాడి వీటన్నిటి నుంచి బయట పడాలనుకున్నారు మస్క్. అందుకే తనకు ట్రంప్ తో ఉన్న వైరాన్ని మరచి మరీ విరాళాలిచ్చారు. ఎన్నో అనుకూల చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించాం అనుకుంటే ట్రంప్ నుంచి అనుకూలత రావల్సింది కాస్తా- వ్యతిరేకత ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇటు రాజకీయంగానూ తనకు ఎదురుగాలి వీయడంతో.. ఈ పార్ట్ టైం పొలిటికల్ యాక్టివిటీస్ ని ఫుల్ టైమ్ గా మలచాలనుకున్నారు- మస్క్. నిజానికి మస్క్ రెండు పడవల మీద కాలు లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక వైపు చూస్తే పీకలోతు వ్యాపారంలో ఉన్నారు. ఆయన తండ్రి ఎరోల్ మస్క్ చెప్పడాన్ని బట్టీ చూస్తే న్యూరాలింక్ పేరిట బయో సైన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మస్క్. ఇదిగానీ వర్కవుట్ అయితే.. ఆయన మార్కెట్ వాల్యూ మరింత పెరిగే అవకాశముంది. ఎందుకంటే ఇది వెన్ను ముక కోల్పోయిన వారికి సంసార జీవితాన్ని, చూపు పోయిన వారికి దృష్టిని ప్రసాదించే అపర సంజీవని. అలాంటి ప్రాజెక్ట్ సెట్ అయితే.. ఇక మస్క్ ని ఆపే వారే లేరని అంటారు ఆయన తండ్రి ఎరోల్ మస్క్.

ఇప్పటికే మస్క్ సంపత విలువ 300 బి. డా. పైగా

ఇప్పటికే ప్రంపచ కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద విలువ ఎంతంటే.. 300 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. అయితే ట్రంప్ తో కలసి ఆయన పరిపాలనలో పార్టిసిపేట్ చేయడంతో ఒక్కసారిగా షేర్ వాల్యూ పడిపోయి వంద బిలియన్ డాలర్ల సంపద ఆవిరై పోయింది. తన కొత్త ప్రాజెక్టులుగానీ గాడిన పడితే.. ఈ మొత్తం నష్టాన్ని అధిగమించడం ఏమంత పెద్ద కష్టం కాదు. బిగ్ బిల్ ద్వారా టెస్లా వంటి ప్రాజెక్టులకొచ్చే నష్టాన్ని కూడా అధిగమించవచ్చు. స్పేస్ ఎక్స్ ద్వారా పొందుతున్న రాయతీలు రద్దయినా వచ్చే నష్టమేం లేదు. కానీ, ఈ కష్టనష్టాలను సులువుగా దాటాలనుకున్న మస్క్.. రాజకీయ పలుకుబడి ఉంటే బాగుటుందనుకున్నారు. కానీ ఇటు క్షేత్ర స్థాయిలో అటు ట్రంప్ స్థాయిలో కూడా ఆయన అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభించాయి. దీంతో ట్రంప్ ని నమ్ముకుని చేసే రాజకీయాలకన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే బావుండని ఫీలయ్యి పార్టీ ప్రకటన చేశారు. ఇంతలో ట్రంప్ మరింత రివర్స్ అయ్యి.. మస్క్ ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా దేశం వదిలి వెళ్లాల్సి వస్తుందనడంతో.. ఇదిగో తన పార్టీ, ఇతర రాజకీయ వ్యవహారాలను కాసేపు పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి. ట్రంప్- మస్క్ మధ్య గొడవ ఏ తీరం చేరుతుందో తేలాల్సి ఉంది.

Related News

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Big Stories

×