BigTV English

Weekly Lucky Zodiac: బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులవారికి వారంరోజులు పట్టిందల్లా బంగారమే..

Weekly Lucky Zodiac: బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులవారికి వారంరోజులు పట్టిందల్లా బంగారమే..

Budhaditya Rajyog Weekly Lucky Zodiac: నేటి నుంచి ఈనెలలో కొత్త వారం ప్రారంభమైంది. ఈ వారంలో కొన్ని రాశులపై బుధాదిత్య రాజయోగం ప్రభావవంతంగా ఉండనుంది. బుధుడు, సూర్యుడు ఈ వారంలోనే సింహరాశిలోకి ప్రవేశిస్తుండటంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో బుధాదిత్య రాజయోగం సంపద, శ్రేయస్సులను, గౌరవాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. ఈ క్రమంలో మేషం, మిథునం, సింహరాశులు సహా 5 రాశుల వారికి ఈ రాజయోగ ప్రయోజనాలు అందుతాయి. కొత్తవారంలో విజయం, ప్రమోషన్, ఆర్థిక లాభాలను చూస్తారు. గౌరవం, విజయాలను తెస్తుంది. కెరీర్ లో కూడా రాణిస్తారు.


ఈ వారంలో శుభఫలితాలు అందుకునే అదృష్టరాశులు

మేషరాశి


ఈ వారంలో మేషరాశివారికి అంతా మంచే జరుగుతుంది. జీవితంలోని ప్రధాన అడ్డంకులను అధిగమిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యాసంస్థల్లో, వృత్తులలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు పొందుతారు. వారం చివరిలో శుభవార్తల్ని వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వారం మొదటిలో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. కోర్టు సంబంధిత విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలోనూ ఆనందంగా ఉంటారు.

మిథునరాశి

ఈ రాశివారికి బుధాదిత్య రాజయోగంతో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వారం ఆరంభంలో శుభవార్తలను వినే అవకాశం ఉంది. కోరుకున్న ప్రాంతానికి ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతి లభించవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏదైనా పథకం లేదా వ్యాపారంలో మునుపటి పెట్టుబడి భారీ లాభాలను ఇస్తుంది. ఆత్మీయుల రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ విషయంలో వచ్చిన అపార్థాలు మీ స్నేహితుల ద్వారా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: రాఖీపండగ రోజు ఆకాశంలో అద్భుతం.. ఈ రాశుల వారికి ధనలాభం

సింహరాశి

ఈ రాశివారికి వ్యాపార సంబంధిత విషయాల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు. ఇంటిలో, బయటి వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పలురకాల ఆదాయ వనరులను కలిగి ఉంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. భూమి, ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నవారికి గౌరవం, ఆనందం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు.

కుంభరాశి

ఈ వారం కుంభరాశివారికి వృత్తి, వ్యాపారపరంగా శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అధికారులు మీకు సానుకూలంగా ఉంటారు. వారం మధ్యలో ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి కారణంగా మీ భవిష్యత్ మారే అవకాశం ఉంది. భూమి, భవనాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఇంటి పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు శుభవార్తలను వింటారు.

మీనరాశి

మీనరాశివారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురుచూసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో జీవితానికి సంబంధించిన అవకాశాలు తలుపు తడుతాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న పదవి, బాధ్యతలను పొందవచ్చు. చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కోరిక నెరవేరుతుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

 

 

 

 

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Big Stories

×