BigTV English

Shravana Masam 2024: శ్రావణమాసంలో ఈ పనులు అస్సలు చేయకండి..

Shravana Masam 2024: శ్రావణమాసంలో ఈ పనులు అస్సలు చేయకండి..

Don’t do these things in Shravana Masam: హిందూమతంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీకమాసంలో శివుడిని ఎంత నియమ, నిష్టలతో పూజిస్తారో.. శ్రావణమాసంలో అమ్మవారిని అంతే భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా.. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు తొలి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కొత్త అల్లుళ్లు, కోడళ్లు అత్తారిళ్లకు వెళ్తారు. అందుకే శ్రావణమాసం వస్తూ వస్తూనే.. ప్రతి ఇంటిలో కొత్తశోభను తీసుకొస్తుంది. మరో రెండ్రోజుల్లో ఆషాఢం ముగుస్తుంది. ఆగస్టు 5 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.


సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్లైన మహిళలంతా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవి రూపులను కొనుగోలు చేసి.. వాటిని పూజలో పెట్టి.. పూజ పూర్తయ్యాక వాటిని మంగళసూత్రాలకు కలిపి కట్టుకుంటారు. నిండునూరేళ్లు పసుపు కుంకుమలతో ఉండాలని, తమ కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్థిక సమస్యలు రాకుండా చూడాలని ఆ లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదంట. మరి అవేంటో తెలుసా?

Also Read : రాఖీ పూర్ణిమ నాడు ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది


1. మాంసాహారం, మద్యం ముట్టకూడదు.

2. పురాణాల ప్రకారం వంకాయని అశుద్ధంగా భావిస్తారు. అందుకే శ్రావణమాసంలో వంకాయకూర తినకూడదు.

3. ముఖ్యంగా ఉపవాసం ఉండే భక్తులు పాలను తీసుకోకూడదు. అభిషేకానికి మాత్రం వాడుకోవచ్చు.

4. శ్రావణమాసంలో శివపూజ చేసేవారు.. సూర్యోదయానికి ముందే మేల్కొని పూజాకార్యక్రమాలు పూర్తిచేయాలి.

5. మీ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

6. అభిషేకానికి పసుపును వాడకూడదు.

7. బ్రహ్మచర్యం పాటించాలి. అన్నివిషయాల్లోనూ నిదానమే ప్రధానంగా ఉండాలి.

8. ఉపవాసం చేసేవారు మధ్యాహ్నం నిద్రిస్తే భోజనం చేసినట్లే.

9. ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

10. రాగ్రి పాత్రల్లో వండిన ఆహారాలను తినకూడదు.

11. శివపూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు.

 

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×