Sai Durga Tej Sambarala Yeti Gattu film shelved: మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). కొత్త రోహిత్ కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ మేకర్స్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మిస్తున్నారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సాయి తేజ్ చాలా కష్టపడ్డాయి. తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. జిమ్ లో కష్టమైన కసరత్తుల చేసి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. ఎస్వైజీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తొంది. దీనికి కారణం ఏంటీ? అసలేం జరిగిందో చూద్దాం.
రూ.120 కోట్ల బడ్జెట్ మాత్రమే
విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గా నటిస్తున్న చిత్రమిది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మెగా హీరో సంబరాల ఏటిగట్టుతో రాబోతున్నాడు. రోహిత్ కేవీ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతోంది. ఇటీవల టైటిల్ ప్రకటించగా.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సాయి తేజ్ లుక్, మేకోవర్ చూసి అంతా షాక్ అయ్యారు. అతడి లుక్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈసారి మెగా హీరో గట్టి కంటెంట్ తో వస్తున్నాడని ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్టు ఫిలిం దూనియా టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం బడ్జెట్ అంట. నిజానికి ఈ సినిమా ముందు రూ. 120 కోట్ల బడ్జెట్ అనుకున్నారట.
ఆగిపోయిన సాయి తేజ్ మూవీ
ఆ బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయాలని దర్శకుడికి చెప్పారట నిర్మాతలు. తీరా 70 శాతం షూటింగ్ కే అనుకున్న బడ్జెట్ అయిపోయింది. ఇంకా మూవీ 30 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అప్పుడే బడ్జెట్ చేయి దాటిపోయిందట. దీంతో నిర్మాతలు చేతులెత్తాశారట. బడ్జెట్ చేదాటిపోవడంతో ఏం చేయాలతో తెలియక డైలామాలో ఉన్నారట. దీంతో మూవీ షూటింగ్ ఆపేశారట. ప్రస్తుతానికి ఈ మెగా హీరో సినిమా షూటింగ్ ఆగిపోయినట్టే అంటున్నారు. గ్యాప్ తీసుకున్న ఈ మెగా హీరో గట్టి కంటెంట్ తో వస్తున్నాడని సంబరపడ్డ అభిమానులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తుంది. మరి ఇది పూర్తి స్థాయిలో ఆగిపోయిందా? లేక మళ్లీ లెక్కలు సరి చేసుకుని తిరిగి ప్రారంభిస్తారా? అనేది క్లారిటీ లేదు.
ఆందోళనలో మెగా ఫ్యాన్స్
ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడమంటే.. మెగా ఫ్యాన్స్ షాకింగ్ న్యూసే అని చెప్పాలి. యాక్సెడెంట్ తర్వాత సాయి దుర్గా తేజ్ సినిమాలు బాగా తగ్గించాడు. అంతకుము బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు తీసిన ఈ హీరో ప్రమాదం నుంచి కోలుకున్న అనంతరం విరూపాక్ష సినిమాతో వచ్చాడు. ఈ మూవీ వందకోట్ల క్లబ్ చేరి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. సాయి తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విరూపాక్ష నిలిచింది. వందకోట్ల క్లబ్ చేరిన తొలి మూవీ కూడా ఇదే. అదే క్రేజ్ ను కంటిన్యూ చేసేందుకు కాస్తా గ్యాప్ తీసుకుని సంబరాల ఏటిగట్టు వస్తున్నాడు. ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, సాయి తేజ్ కు మరో వందకోట్ల క్లబ్ మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ అంత ఆశపడ్డారు. కానీ, ఈ సినిమా బడ్జెట్ అడ్డుకట్ట వేస్తుందని ఊహించలేదంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా వస్తుందా? లేదా? అని అభిమానులంత ఆందోళన చెందుతున్నారు.
Also Read: Kuberaa OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే