Fake Currency Busted: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయ్యింది. తుక్కుగూడ ఏరియాలో దొంగనోట్లు తయారు చేస్తున్నవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల ఫేక్ కరెన్సీ, ప్రింటింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై రాచకోండి సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఫేక్ కరెన్సీకి పాల్పడినట్లు తెలిపారు. ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి.. ఫేక్ ప్రింటింగ్ మిషన్‌ను సీజ్ చేశామన్నారు. నిందితులు ఒరిజినల్, నకిలీ నోట్లు గుర్తు పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. జీఎస్-45 అనే పేపర్‌పై ప్రింట్ చేసి ఫేక్ కరెన్సీ ముద్రించే ప్రయత్నం చేశారని తెలిపారు.
గుజరాత్, కోల్‌కత్తాకు చెందిన వ్యక్తులతో నిందితులు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష ఫేక్ కరెన్సీ ముద్రిస్తే.. రూ.10వేలు ఇచ్చేలా డీల్ కుదర్చుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. రెండు పేపర్లు ఒకదానికొకటి కలిపి థిక్ నెస్ వచ్చేలా ఫేక్ కరెన్సీ ముద్రించారని పేర్కొన్నారు. హై ప్రింటింగ్ వాల్యూతో స్కానింగ్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ఆ ఫేక్ కరెన్సీ నోట్లు సర్క్యులేషన్‌లోకి రాలేదని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.