BigTV English

Guru Nakshatra Gochar: ఈ 4 రాశుల వారికి రాజయోగం.. ఎప్పటినుంచి అంటే

Guru Nakshatra Gochar: ఈ 4 రాశుల వారికి రాజయోగం.. ఎప్పటినుంచి అంటే

Guru Nakshatra Gochar: ఆనందం, శ్రేయస్సు, గౌరవం, జ్ఞానాన్ని ఇచ్చే బృహస్పతి సుమారు ఒక సంవత్సరంలో తన రాశిని మార్చబోతున్నాడు. దీంతో మొత్తం 12 రాశులపై పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. ప్రస్తుతం గురుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని రాశి రోహిణిలో బృహస్పతి రావడంతో పలు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు, రాజయోగం పట్టనుంది. ఆగస్టు 20వ తేదీ వరకు రోహిణి నక్షత్రంలో గురుడు ఉంటాడు. అయితే గురుడు, చంద్రుడు కలయిక వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయో తెలుసుకుందాం.


వృషభ రాశి:

వృషభ రాశి వారికి రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్‌లో పురోగతి ఉండబోతుంది. ఉన్నత స్థానం, డబ్బు, ప్రతిష్ట పొందుతారు. సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఈ సమయాన్ని ఆస్వాదిస్తూ కుటుంబంతో గడుపుతారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.


సింహ రాశి:

గురుగ్రహ సంచారం సింహరాశి వారిలో పెను మార్పులను తెస్తుంది. ఈ మార్పు సానుకూలంగా ఉంటుంది. నచ్చిన పనిని చేయడానికి అవకాశం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇప్పుడు చేసే పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. ప్రతి రంగంలో లాభాలను పొందవచ్చు.

కన్యా రాశి:

రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం కన్యారాశి వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఆర్థిక లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల మొగ్గు ఉంటుంది. తీర్థయాత్రలకు కూడా వెళ్లవచ్చు. పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు.

తులా రాశి:

బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉంటూ తుల రాశి వారికి చాలా లాభాలను చేకూర్చనున్నాడు. ఈ రాశి వారికి ఆదాయం పెరగవచ్చు. జీతం పెంపు, ప్రమోషన్ గురించి శుభవార్త వింటారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Big Stories

×