Ganneru plant : భగవంతుడు సృష్టించిన భూమి మీద ఎన్నో లక్షల జాతులు వృక్షాలు ఉన్నాయి. ఎన్నో పూల చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటినితోనే పూజలు చేస్తుంటారు. అలాంటి వాటిలో గన్నేరు ఒకటి. గన్నేరు చెట్టు పువుల్ని దైవ పూజలతోపాటు తాంత్రిక పూజలకి ఉపయోగిస్తుంటారు. గన్నేరు అనేక విషపూరితమైంది అన్న మాట వెంటనే గుర్తుకు వస్తుంది. వాస్త్రు శాస్త్రం గన్నేరు చెట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. శివపూజలో గన్నేరు పూజకి విశేష స్థానం ఉంది. ఇంట్లో నిత్యం భార్య, భర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లల్లో గన్నేరు మొక్కను పెంచుకుంటే పరిష్కారం దొరుకుతుందని శాస్త్రం చెబుతోంది.
లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలతో పూజ ఆనందాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. తెల్లగన్నేరు పూలతో పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పసుపు రంగులో ఉండే గన్నేరు పూలు శ్రీ మహావిష్ణువుకి ప్రీతపాత్రమైనవని శాస్త్రం చెబుతోంది. పసుపు పూలతో పూజ వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గన్నేరు చెట్టు పెంపకం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. తెల్లగన్నేరు ఇంటి తీర్పు లేదా ఈశాన్య దిక్కులో మాత్రమే పెంచాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. సహజంగా పూజల్లో చేసే పూలకి నిర్మాల్య దోషం ఉంటుంది. కానీ గన్నేరు పూలకి ఇది వర్తించదు. దేవుడికి పూజ చేసిన మర్నాడు ఆ పూలను తొలగించకపోయినా నిర్మాల్య దోషం అంటదని శాస్త్రం చెబుతోంది. అలాగని తీయకుండా ఉండకూడదు. కారణం మిగతా పూలతో పోల్చితే గన్నేరు మూడు రోజులపాటు వికసించే ఉంటుంది.
నిలువెల్లా విషం ఉన్న గన్నేరులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. బిల్ల గన్నేరు, పచ్చ గన్నేరు, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, ముద్ద గున్నేరు ఇలా రకాలు ఉన్నాయి. దేవుడి పూజకే కాదు ఒంటిపై వచ్చే బాహ్య రోగాలకి ఇది మందులాగా ఉపయోగపడుతుంది. చర్మవ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. గన్నేరు ఆకులను నీళ్లలో మరిగించి ఆ నీటితో రుద్దుకుని స్నానం చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు , వాపులు తగ్గుతాయని ఆయర్వేద శాస్త్రం చెబుతోంది. గన్నేరు రసాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు.