BigTV English

Horoscope gemini 2025 :  మిథున రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope gemini 2025 :  మిథున రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope gemini 2025 :   గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం మిథున రాశి జాతకులకు ఆదాయం -14, వ్యయం-2గా ఉంది. అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు.   ధన పరంగా వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-6,  అవమానం – 3 గా ఉంది. అంటే ఆరు మంది మీకు గౌరవం ఇస్తే.. ముగ్గురు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


జనవరి : మిథున రాశి జాతకులు ఈ నెలలో దాయాదులతో ఉన్న ఆస్థి వ్యవహారాములలో గొడవలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యాపార విషయంలో జాయింటుదారులతో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపారములు లాభదాయకంగా సాగును. వ్యవసాయదారులకు లాభాలు వచ్చే అవకాశములున్నాయి.

ఫిబ్రవరి :  మిథున రాశి జాతకులకు ఈ నెలలో  ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆస్తుల రీత్యా ఆదాయం చేతికి అందుతుంది. కొన్ని విషయాలలో  అనుకూల ఫలితాలు పొందుతారు. ధన, ధాన్య లాభాలున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, కంప్యూటర్ రంగాల వారికి లాభదాయకం ఉంటుంది.


మార్చి:  మిథున రాశి జాతకులకు ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది.   ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వాహనాలు నడిపే వారికి.. గవర్నమెంటు, మరియు ప్రైవేటు రవాణా సంస్థలకు ఎక్కువ ఆదాయం  వస్తుంది. ఈ నెలలో  నూతన కార్యలకు శ్రీకారం చుడతారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలొస్తాయి.

ఏప్రిల్ : మిథున రాశి జాతకులకు ఈ నెలలో  ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రులతో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృథా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుతలకు ఉన్నతాధికారులతో సఖ్యత ఏర్పడుతుంది.

మే :  మిథున రాశి జాతకులకు ఈ నెలలో  ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులకు  పై అధికారుల అండదండలు ఉంటాయి.  అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో కలిసి వస్తుంది.

జాన్ :  మిథున రాశి జాతకులకు ఈ నెలలో   తండ్రి వర్గం నుంచి ఆనారోగ్య వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా వస్తాయి. అలాగే ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందుతలు తలెత్తే అవకాశం ఉంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

జూలై :  మిథున రాశి జాతకులు ఈ నెలలో  పరిశోధనా రంగంలో ముందంజ వేస్తారు. చెడు అలవాట్లు తగ్గించుకొనుట మంచిది. చెడు స్నేహాల వల్ల  ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. ఉపాధ్యాయములకు స్థాన చలన సూచనలున్నాయి.

ఆగష్టు:  మిథున రాశి జాతకులకు ఈ నెలలో వృత్తి ఉద్యోగాలలో అభివృద్ది కనిపిస్తుంది. స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే సూచనలున్నాయి.

సెప్టెంబర్ :   మిథున రాశి జాతకులకు ఈ నెలలో  ముఖవర్చస్సు వెలిగిపోతుంది.  కార్యజయముతో ముందుకు సాగుతారు. మిత్రులకు ఉపకారము చేస్తారు. రాజకీయ నాయకులు మౌనంగా ఉండాలి. లేదంటే గొడవలు అయ్యే సూచనలున్నాయి.

అక్టోబర్ :  మిథున రాశి జాతకులకు ఈ నెలలో     వివాహ, గృహ నిర్మాణ,  శుభకార్యాలు చేసేందుకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అన్ని రంగాల వారికి ఈనెల అనుకూలమైన సమయము. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నవంబర్ :   మిథున రాశి జాతకులకు ఈ నెలలో  సర్వవృద్ధి జరుగుతుంది.    సుఖము, సంతోషము, ధన ధాన్య వృద్ధి కలుగుతుంది.  మీ తెలివితేటలతో అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కొంతమందితో గొడవలు అయ్యే సూచనలున్నాయి.

డిసెంబర్ :   మిథున రాశి జాతకులకు ఈ నెలలో  వాహనయోగం ఉంది.  వ్యాపారుదారులకు మంచి యోగకాలం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వస్త్ర, ధన, ధాన్య లాభం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×