Almonds For Hair: పెరుగుతున్న ఒత్తిడి, పని ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా చర్మం, జుట్టు కూడా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా మనం జుట్టు గురించి మాట్లాడుకుంటే.. మాత్రం చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది.
చిన్న వయసులోనే జుట్టు రంగు మారినప్పుడు ఒత్తిడి మరింత పెరుగుతుంది ఎందుకంటే నెరిసిన జుట్టు మన అందాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో మీరు రసాయనాలను ఉపయోగించకుండానే మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకు బాదం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి బాదంతో మీరు మీ జుట్టును ఎలా నల్లగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం నూనె వాడండి:
మీరు మీ జుట్టుకు క్రమం తప్పకుండా బాదం నూనెతో మసాజ్ చేస్తే.. అది మీ జుట్టు రంగును మెరుగుపరుస్తుంది. ఇందు కోసం బాదం నూనెను కొద్దిగా వేడి చేసి.. వేళ్లతో తలను మసాజ్ చేయండి. ఇలా తరచుగా జుట్టుకు బాదం నూనె వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు ఈ నూనెను జుట్టు చివర్లకు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు కూడా తక్కువ సమయంలోనే నల్లగా మారుతుంది.
బాదం నూనె, ఉసిరి మిశ్రమం:
బాదం, ఉసిరి నూనెలను సమాన మోతాదులో తీసుకుని దీనిని గోరువెచ్చగా చేయండి. తర్వాత ఈ నూనెను
జుట్టుకు చివరల వరకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఎందుకంటే ఈ నూనె మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా చేస్తుంది.
Also Read: చిటికెడు కాఫీ పొడితో.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !
బాదం పేస్ట్ :
బాదం పేస్ట్ ఉపయోగించి మీరు మీ జుట్టును సహజంగా నల్లగా చేసుకోవచ్చు. దీని కోసం.. ముందుగా బాదం పప్పులను 7 నుండి 8 గంటలు నానబెట్టండి. ఇప్పుడు బాదంపప్పులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేయండి. దానికి కొంచెం పాలు లేదా పెరుగు కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జుట్టు మూలాలకు అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. మీరు ఈ పేస్ట్‌ని కనీసం వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఉంటుంది. తక్కువ సమయంలోనే బాదం పేస్ట్ వాడటం వల్ల తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.