E-Paper
Advertisement

Horoscope Today April 29th : ఆ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి – సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Horoscope Today April 29th : ఆ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి – సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 29న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Advertisement

వృషభం: కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉంటుంది.  వ్యాపారస్తులు విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక నష్ట సూచనలున్నవి.

మిధునం: పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

కర్కాటకం: కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసి రావు. ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

కన్య: ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు.

వృశ్చికం: పాత రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.

ధనస్సు: ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభ వార్తలు అందుతాయి.

కుంభం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

మీనం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×