trinayani serial today Episode: గాయత్రి చేసింది మంచేనని అంటుంది నయని. దీపారాధన చేయకుండా హారతి తీసుకోవడం కరెక్టు కాదు కదా అంటుంది. పెద్దావిడ చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా బ్రో అంటాడు విక్రాంత్. దీంతో ఆ బొమ్మ నా నెత్తికి తగిలి ఉంటే అంటాడు వల్లభ. బుర్ర లేనప్పుడు మరింకేమో అవుతుందని భయపడటం దేనికి బావగారు అంటూ గాయత్రిని తీసుకుని వెళ్లిపోతుంది. మమ్మీ పెద్దమరదలు ఏమో అంది అని వల్లభ, తిలొత్తమ్మను అడుగుతాడు. నీ ముఖం అద్దంలో చూసుకోమంది అని చెప్తుంది తిలొత్తమ్మ.
ఎప్పుడూ లేనిది పెద్ద బావగారు చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటి..? అని ఆలోచిస్తుంది సుమన. ఇంతలో విక్రాంత్ వస్తాడు. మనసులో అనుకోవాల్సిన మాటలు బయటకు అనేస్తున్నావేంటి అంటాడు. నేనేం అన్నాను అంటుంది సుమన. విన్నాను కానీ నువ్వు అన్నది నిజమే.. మ అమ్మవాళ్లు చేయరాని పనేదో చేశారు అంటాడు విక్రాంత్. అందుకేనేమో గాయత్రి పాప బొమ్మ విసిరేసింది అంటాడు పావణమూర్తి. రాయిచ్చి కొట్టాల్సింది అల్లుడు అంటుంది దురందర. అలాంటి టైం కూడా దగ్గరలోనే ఉంది అత్తయ్యా అంటాడు విక్రాంత్.
చూడమ్మా ఎవరు ఎన్ని వేషాలు వేసినా తిలొత్తమ్మ అక్కయ్యను గాయత్రి పాప నుంచి ఎవ్వరూ కాపాడలేరు అంటాడు పావణమూర్తి. దీంతో అన్ని మీరే అనుకుని ఆమె దశదిన కర్మ చేసేలా ఉన్నారే అంటుంది సుమన. అస్థికలు గంగలో కలపడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారంటే నమ్ము సుమి అంటుంది దుంరందర. నువ్వు తోడుగా వెళ్లాలనుకుంటున్నావా..? అంటాడు విక్రాంత్. దీంతో ఎవరు ఎటు పోతే నాకేంటి అంటుంది సుమన. వదిన నా కడుపున పుడుతుందని బాధపడ్డాను కానీ పాపిస్టి రాలి ఆయుష్షు నేనే పెంచుతున్నానేంటి అని మనసు మార్చుకున్నాను అంటుంది దురందర.
తర్వాత దురందర కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతుంది. అందరూ వస్తారు. ఏమైందని అడుగుతారు. వల్లభ వచ్చి ఇప్పుడు మేమేం చేయలేదే అంటాడు. తిలొత్తమ్మ తిడుతుంది. ఇంతలో రత్నాంభ ఇప్పుడు ఎన్ని నెలలు అని అడుగుతుంది. మొన్నే ఏడు నెలలు పడ్డాయని నయని చెప్తుంది. అయితే కొందరికి ఏడు నెలలకే పురిటి నొప్పులు వస్తాయి. అదృష్టం బాగుంటే.. తల్లిపిల్ల ఇద్దరూ బాగుంటారని రత్నాంభ అంటుంది. దీంతో అందరూ హాస్పిటల్ కు వెళ్దాం పదండి అనగానే.. హాస్పిటల్ కు కాదు.. మనం వెళ్లాల్సింది గుడికి అని చెప్తుంది. ఎందుకని తిలొత్తమ్మ అడగ్గానే.. మీ మరణం ఆపాలన్నా.. త్రినేత్రిని చూడాలన్నా మనం అందరం గుడికి వెళ్లాలి అంటుంది.
దీంతో వల్లభ నయని మాటలు మేము నమ్మం మేము రాము అంటాడు. మీ ఇష్టం మీ కర్మ అంటుంది నయని. అయితే నాకు ఇప్పుడు డెలివరీ అవుతుందా నయని అని దురందర అడుగుతుంది. దీంతో ఎందుకని పావణమూర్తి అడుగుతాడు. ఏం లేదండి.. ఇప్పుడు నాకు డెలివరీ అయితే తిలొత్తమ్మ నా కడుపున పుట్టదు.. అని చెప్తుంది దురందర. అలా అయితే ఎలా మనం గుడికి వెళ్లాక ఇక్కడ అత్తయ్య చనిపోయి అక్కడ పునర్జన్మ ఎత్తవచ్చు కదా అంటుంది సుమన. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో అందరూ కలసి గుడికి వెళ్లాలని డిసైడ్ అవుతారు.
సుమన వెళ్లి చీరలు చూస్తుంది. గుడికి వెళ్లాలని వదిన చెబితే ఇక్కడేం చేస్తున్నావు అంటూ విక్రాంత్ వచ్చి అడుగుతాడు. ఏ చీర కట్టుకోవాలోనని చూస్తున్నాను బుల్లిబావగారు అంటుంది. ఇంతలో పావణమూర్తి వచ్చి అల్లుడు ఏ డ్రెస్ వేసుకోవాలి అని విక్రాంత్ ను అడుగుతాడు. దీంతో సుమన అనుమానంగా చూస్తుంది. పిన్ని కడుపు నొప్పితో బాధపడుతుంటే మీరు కూడా ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా..? అని అడుగుతుంది. తమ ప్లాన్ వర్కవుట్ అవుదుగా అంటాడు పావణమూర్తి. సుమన ఏం ప్లాన్ బాబాయ్ అంటుంది. ఏదో చెప్పి మాట మారుస్తాడు పావణమూర్తి.
అందరూ గుడి దగ్గరకు వెళ్లాక వల్లభ అనుమానంగా మమ్మీ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. కుడి కన్ను అదురుతుందిరా ఏదైనా కీడు జరుగుతుందా..? అని అనుమానపడుతుంది. ఇంతలో నయని వాళ్లు వస్తారు. దురందర నార్మల్ గా ఉంటే రత్నాంభ నీకు కడుపు నొప్పి పోయిందా అని అడుగుతుంది.. అవును కదా..? నాకు కడుపు నొప్పి అని దురందర బాధపడుతుంది. ఇంతలో విక్రాంత్, విశాల్ వస్తారు. విశాల్ ను చూడగానే.. రత్నాంభ మా త్రినేత్రి ఎక్కడ బాబు అని అడుగుతుంది. ఇక్కడ విశేష పూజ జరుగుతుందని తెలిసి ప్రదక్షిణ చేయడానికి వెళ్లిందని విక్రాంత్ చెప్తాడు. అందరూ అమ్మవారి దగ్గరకు వెళ్తారు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?