OTT Movie : షార్ట్ ఫిల్మ్ ద్వారా సామాన్యుడు కూడా తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు. ఒక సెల్ ఫోన్ తో వీటిని తీస్తూ, సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న వాటికి అవార్డులు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక ఉల్లిపాయ దెయ్యం చేసే రచ్చ మామూలుగా ఉండదు. రాత్రి పూట ఇది చేసే విన్యాసాలు చూడాల్సిందే. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (youtube) లో
ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘టేల్ ఆఫ్ ఆనియన్ విచ్’ (A tale of an onion witch). ఇది రెండు భాగాలుగా విడుదలైంది. ఈ స్టోరీ ఒక ఉల్లిపాయ దెయ్యం చుట్టూ తిరుగుతుంది. యూట్యూబ్ (youtube) ఈ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది.
పార్ట్ :1 స్టోరీ
ఇద్దరు యువకులు ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవడానికి వెళతారు. ఒక చోట ఇళ్ళు అద్దెకి దొరుకుతుంది. అయితే ఆ ఇంటి యజమాని వీళ్ళకు ఒక విచిత్రమైన హెచ్చరిక చేస్తుంది. రాత్రి సమయంలో ఒక 100 ఏళ్ల వయసు గల మంత్రగత్తె (విచ్) తలుపు తట్టి ఉల్లిపాయ అడుగుతుందని, ఆమెకు తలుపు తీయకూడదని చెబుతుంది. ఈ యువకులు ఈ హెచ్చరికను పట్టించుకోకుండా, ఒక రాత్రి అందమైన ఆడపడుచు తలుపు తట్టి సహాయం అడిగినప్పుడు, వీళ్ళు తలుపు తెరుస్తారు. అక్కడి నుండి వారి జీవితాలు భయంకరమైన మలుపు తీసుకుంటాయి. ఈ ఉల్లిపాయ మంత్రగత్తె ఎందుకు ఉల్లిపాయలు అడుగుతుంది? వారు ఈ భయంకరమైన రాత్రిని తట్టుకోగలరా? అనే ప్రశ్నల చుట్టూ స్టోరీ నడుస్తుంది.
పార్ట్ : 2 స్టోరీ
పార్ట్ 1 సంఘటనలు జరిగిన ఒక సంవత్సరం తర్వాత, ఒక కొత్తగా వివాహమైన జంట ఈ అపార్ట్‌మెంట్‌లోకి వస్తారు. వాళ్ళకి కూడా ఒక 150 ఏళ్ల వయసు గల మంత్రగత్తె గురించి హెచ్చరిక వస్తుంది. ఆమె రాత్రి సమయంలో ఉల్లిపాయ అడుగుతూ తిరుగుతుందని ఇంటి ఓనర్ చెప్తుంది. అయితే విచిత్రంగా ఒక చిన్న అమ్మాయి తలుపు తట్టి సహాయం అడుగుతుంది. ఆ తారువాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ జంటకి భయంకరమైన సంఘటనలు ఎదురౌతాయి. చివరికి ఈ జంట ఆ అపార్ట్మెంట్ నుంచి బయట పడతారా ? ఆ దెయ్యం వీళ్ళను ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. అనేవిషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రపంచం మొత్తం వైరస్ వచ్చి తుడిచి పెట్టుకుపోతే… ఈ పిల్ల మాత్రం వైరస్నే తరిమి కొడుతుంది