Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 14న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.
వృషభం: దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంత వరకు బయట పడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
మిధునం: రుణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
కర్కాటకం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
సింహం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య: వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి
తుల: మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనస్సు: నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.
మకరం: సన్నిహితులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.
కుంభం: వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం: నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గత కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?