Rupa Lakshmi : సినీ నటి రూప లక్ష్మీ పేరు అతి కొద్దిమందకి మాత్రమే కానీ బలగం లచ్చవ్వ అంటే అందరు గుర్తు పడతారు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన మొదటి మూవీ బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది. సినిమా మొత్తానికి ఈ పాత్ర హైలెట్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. కూతురుగా తన తండ్రి చనిపోతే ఆమె పడ్డ బాధల్లోని ఈ సినిమాలో చూపించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె సినిమాల్లో బిజీగా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. ఆ సినిమా తర్వాత ఈమె పలు ఇంటర్వ్యూ లు ఇస్తూ తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకొని అందరిని ఆకట్టుకుంది. ఈ మధ్య సినిమాల కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
లచ్చవ్వ గతంలో చాలా సినిమాల్లో నటించింది. సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాల్లో నటించింది. డీజే, మిడిల్ క్లాస్ అబ్బాయి, జయ జానకీ నాయకా, మహర్షి ఇలా అనేక హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. కానీ గుర్తింపు రాలేదు. బలగం సక్సెస్ తో ఎట్టకేలకు రూపాలక్ష్మి అనే ఒక లేడి సినిమాల్లో నటిస్తుందా అని అందరికి తెలిసింది. బలగం మూవీ ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది.. అయితే సినిమాల్లో బిజీగా ఉండే యాక్టర్స్ అందరు కూడా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. ఈమె కూడా నెట్టింట రీల్స్ చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు..
Also Read: సుమ ఇంటిని ఏ సినిమా షూటింగ్ లకు ఇచ్చారో తెలుసా..?
ఆ వీడియోలో టైట్ జీన్స్, టీ షర్ట్ ధరించిన రూప లక్ష్మి ఓ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ తో అలరించింది. రూపాలక్ష్మిలో వచ్చిన ఈ మార్పు చూసి ఆమె ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. రూపాలక్ష్మి కూడా చివరికి టాలెంట్ చూపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.. జనాల మదిలో ఉండాలన్నా, వార్తల్లో నిలవాలన్నా.. సోషల్ మీడియా ఏకైక మార్గం. ఏదో ఒకటి చేసి నెటిజెన్స్ మాట్లాడుకునేలా చేయాలి. అలాగే సోషల్ మీడియా చిన్న నటులకు ఆదాయ మార్గంగా మారింది. ఈరోజుల్లో సినిమాల్లో నటిస్తే సరిపోదు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకొనేలా చేస్తూ తమ ప్రతిభను బయటపెడుతూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సురేఖావాణి, ప్రగతి చాలా ముందున్నారు. ప్రగతి డాన్స్, జిమ్ వీడియోలు చేసి నెటిజెన్స్ నోళ్ళలో నానుతుంది. ఆమె ఫిట్నెస్ వీడియోలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోదు. వెయిటింగ్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ టైటిల్ కొట్టేస్తుంది.. సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈమె కూడా చేరిపోయింది.
?igsh=czdhMGwybXplZ3No