Hair Dye For White Hair: చాలా కాలం క్రితం.. ఎవరి జుట్టు అయినా నెరిసిపోవడం ప్రారంభిస్తే.. అది పెరిగిన వయస్సు కారణంగా వచ్చిందని భావించేవారు. కానీ ప్రస్తుతం వాతావరణం, జీవనశైలి, ఆహారం పట్ల శరీరం కూడా భిన్నంగా స్పందించడం ప్రారంభించింది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. రంగు మారిన జుట్టుతో చిన్నా పెద్దా సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి వివిధ రకాల హెయిర్ కలర్స్ వాడుతున్నారు. కానీ వీటిని ఉనయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఇంట్లోనే హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడాలి. వీటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా వీటిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.మీ తెల్ల జుట్టును నల్లగా, బలంగా మార్చుకోవడానికి సహజమైన హెయిర్ కలర్ ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేచురల్ హెయిర్ డై-బ్లాక్ టీ:
మీ జుట్టును బట్టి బ్లాక్ టీ తీసుకోవాలి. సాధారణ పొడవు జుట్టుకు, 4 టీస్పూన్ల బ్లాక్ టీ సరిపోతుంది. టీ ఆకులను నీటిలో మరిగించండి. బాగా మరిగిన తర్వాత.. మూతపెట్టి చల్లబరచండి. దీన్ని బాగా వడకట్టి.. ఈ ద్రావణాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. రంగు బాగా రావడానికి రోజు ఒక రోజు విడిచి మరొక రోజు డికాషన్ జుట్టుకు వాడండి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకండా తెల్ల జుట్టు రాకుండా కూడా ఇది నివారిస్తుంది.
హెన్నా, ఉసిరి, కాఫీ పేస్ట్:
తెల్ల జుట్టును తొలగించడానికి కాఫీ, ఉసిరి, హెన్నా పొడులను కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని తెల్ల జుట్టు మీద బాగా అప్లై చేసి పూర్తిగా ఆరబెట్టండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఈ సహజ రంగు జుట్టు రంగును క్రమం తప్పకుండా వాడండి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా, నల్లగా మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టును పూర్తిగా నివారిస్తుంది .
కరివేపాకు, కొబ్బరి నూనె:
కరివేపాకు, కొబ్బరి నూనెల కలయిక తెల్ల జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు చిన్న కప్పుల కరివేపాకు , రెండు కప్పుల కొబ్బరి నూనె సమాన పరిమాణంలో తీసుకోవాలి. రెండింటినీ కలిపి గ్యాస్ పై ఆకులు నల్లగా మారే వరకు మరిగించాలి. అది చల్లబడే వరకు మూతపెట్టి ఉంచండి. తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేయండి. దీనిని వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించవచ్చు. కరివేపాకు మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టులో మెలమైన్ అనే వర్ణద్రవ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
పెరుగు, షీకాకై పొడి:
పెరుగు, షీకాకై పొడులను తగిన మోతాదుల్లో తీసుకుని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. మీరు ఈ పేస్ట్ ని మీ జుట్టుకు. అప్లై చేయవచ్చు. మీరు దీన్ని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. 45 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.
Also Read: అశోక చెట్టు ఆకులతో.. ఈ సమస్యలన్నీ పరార్ !
మన పూర్వీకులు కూడా పురాతన కాలం నుండి జుట్టు కోసం షీకాకై ఉపయోగిస్తున్నారు. ఇది మీ తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టుకు వీడ్కోలు చెప్పి.. మీ నల్లని మెరిసే జుట్టును పెంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.