Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 29న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
వృషభం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.
మిధునం: దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తలకు పని ఒత్తిడి అధికమవుతుంది.
కర్కాటకం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాల్లో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది.
కన్య: మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
తుల: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
ధనస్సు: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.
మకరం: ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కుంభం: కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొత సామాన్యంగా సాగుతాయి.
మీనం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధు, మిత్రులతో విందు, వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్