E-Paper
Advertisement

Horoscope Today May 6th : ఆ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు – దూరపు బంధువుల నుంచి శుభవార్తలు  

Horoscope Today May 6th : ఆ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు – దూరపు బంధువుల నుంచి శుభవార్తలు  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 6న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

వృషభం: శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురికావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.

మిధునం: నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

Advertisement

కర్కాటకం: ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

సింహం: ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందర పాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల:  నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.

ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.

మకరం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.

కుంభం: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

మీనం: ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలోఅధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. వ్యాపార పరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలు పరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×