Nindu Noorella Saavasam Serial Today Episode : హర్ష చెప్పిన డైరెక్షన్‌లో వచ్చిన మిస్సమ్మ అక్కడ ఉన్న ఇంటిని చూసి షాక్ అవుతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన అమర్ ఎస్సైతో మాట్లాడుతుంటే.. ఆ బాబ్జీని రాత్రంతా కొట్టినా నిజం చెప్పడం లేదని ఎస్సై అంటాడు. దీంతో వాడు నోరు తెరువకపోయినా పర్వాలేదు ఆఫీసర్ వాడి ఫోన్ దొరికింది అంటూ ఫోన్ ఎస్సైకి ఇస్తాడు. ఇంతలో లోపలికి మనోహరి, చిత్ర వస్తారు. వాళ్లను చూసిన ఎస్సై మీరు మనోహరి గారు కదా.. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. దీంతో అమర్, బాబ్జీతో కలవడానికి వచ్చారు అని చెప్తాడు. దీంతో ఎస్సై ఈ కేసు విషయంలో నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. కానీ మీరే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అదేనండి అరుంధతి గారి మర్డర్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి.
అవి క్లియర్ చేసుకుందామనుకున్నాను. బాబ్జీ పని అయ్యాక మిమ్మల్ని కలుద్దామనుకున్నాను. ఇంతకీ బాబ్జీతో ఏం పని ఉంది అని అడగ్గానే.. చిత్ర కల్పించుకుని మా ఫ్రెండ్‌ను చంపిన వాడితో మాకు పనేం ఉంటుంది సార్ వాడు ఇదంతా ఎందుకు చేశాడో అడగడానికి వచ్చాము. వాడు చంపింది ఒక దేవతను అని నిలదీయడానికి వచ్చాము అని చెప్తుంది. దీంతో ఎస్సై సరే వెళ్లండి అని వాళ్లను లోపలికి పంపిస్తాడు. లోపలికి వెళ్లిన బాబ్జీని పలకరించిన మనోహరి నువ్వు నా పేరు బయటకు చెబితే నీ భార్యా పిల్లలను వదలను అంటూ వాళ్లను కిడ్నాప్ చేసిన వీడియో చూపిస్తుంది మనోహరి. దీంతో బాబ్జీ భయంతో వాళ్లను ఏమీ చేయకండి. నాకేం డబ్బులు వద్దు అంటూ వేడుకుంటాడు. నువ్వు నా పేరు చెప్పనంత వరకు నేను వాళ్లను ఏమీ చేయను అంటుంది.
హర్ష చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లుంది మిస్సమ్మ. ఎదురుగా అనామిక వచ్చి భాగీ ఎక్కడికి వెళ్లావు చాలా సేపటి నుంచి నువ్వు కనిపించలేదు అని అడిగినా పలకకుండా వెళ్లిపోతుంది. రాథోడ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మా మేడం ఎక్కడున్నా ఏం చేస్తున్నా.. పొద్దున్న పది గంటలకు ఇంటికి వచ్చి ఎఫ్‌ఎం వినేవారు. ఆర్‌జేతో మాట్లాడేవారు అంటాడు. అంతా గుర్తు చేసుకుంటూ పైకి వెళ్తుది. పైన రూంలో అంజు ఫోన్‌లో ఏదో చూస్తుంటే అమ్ము వస్తుంది. ఓసేయ్ అంజు ఆ ఫోన్ స్విచ్చాప్ చేయమని చెప్పాను కదా..? అంటే అమ్ము అమ్మ ఫోటోలు చూస్తున్నాను.. స్విచ్చాప్ చేస్తానులే అంటుంది అంజు.
దీంతో అమ్ము కోపంగా అరేయ్ మీరు ఇద్దరు ఉన్నారు దానికి చెప్పాలి కదా..? అంటుంది. దీంతో ఆనంద్ నువ్వు మమ్మల్ని అంటావేంటి అక్కా అది ఎంత చెప్పినా చేయడం లేదు అంటాడు. అమ్ము కోపంగా అంజు నువ్వు ముందు ఫోన్ స్విచ్చాప్ చేస్తావా..? లేదా..? అంటుంది. అమ్ము అమ్మ ఫోటోలు మాత్రమే చూస్తున్నా అంటుంది అంజు. ఆ ఫోటోలు హైదరాబాద్ వెళ్లాక చూసుకోవచ్చు పొట్టి ఆ ఫోన్ ఆన్‌లో ఉంటే మిస్సమ్మకు నిజం తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది అంటాడు ఆనంద్. దీంతో అంజు ఏం బాచ్ రా మీరు ఇంత పిరికి వాళ్లు అనుకోలేదు అసలు నాకు అక్కా అన్నయ్యల్లాగా ఎలా పుట్టారురా.. అంటుంది. ఇంతలో ఆ ఫోన్ కు కాల్ వస్తుంది. ఆకాష్ చూసి అక్కా మిస్సమ్మ కాల్ చేస్తుంది అని చెప్తాడు. డోర్ చాటునే ఉన్న మిస్సమ్మ పిల్లల మాటలు వింటుంది. అమ్ము భయంగా మిస్సమ్మ అమ్మ ఫోన్‌కు ఎందుకు చేస్తుంది.. మిస్సమ్మ వెతికే కొడైకెనాల్ అక్క అమ్మే అని తెలిసిపోయిందేమో అంటాడు ఆనంద్..
అమ్మో ఈ నిజం మిస్సమ్మకు తెలియకూడదని మనకు తెలిసిన రోజు డాడీ స్టిక్ట్ గా చెప్పారు కదా అంటాడు ఆకాష్.. మిస్సమ్మకు మన వల్ల నిజం తెలిసిపోయిందని డాడీకి తెలిస్తే ఇంకేం ఉంటుంది. అంటుంది అమ్ము.. ఇలా పిల్లలు మాట్లాడుకునే మాటలు డోర్ చాటు నుంచి వింటూ ఏడుస్తుంది. అంజు ఫోన్ స్విచ్చాప్ చేస్తుంది. తర్వాత అందరూ చెస్ ఆడుకుంటుంటే.. మిస్సమ్మ లోపలికి వస్తుంది. మిస్సమ్మను చూసి అమ్ము ఏమైంది మిస్సమ్మ అంత డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది. అంజు కూడా మిస్సమ్మ నువ్వు హ్యాపీగానే ఉన్నావా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఏడుస్తూ పిల్లలను హగ్ చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?