Psycho Killer Horror Thriller OTT : హారర్ సినిమాల్లో సైకో కిల్లర్స్ వేసుకునే మాస్క్‌లు చాలా ఫేమస్. ‘స్క్రీమ్’, ‘హాలోవీన్’ లాంటి సినిమాల్లో మాస్క్ కిల్లర్స్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే స్టైల్‌లో ఒక పసిపాప మాస్క్ వేసుకుని క్రూరంగా మర్డర్స్ చేసే కిల్లర్ కథతో వచ్చిన లేటెస్ట్ మెటా-హారర్ థ్రిల్లర్ మూవీనే ‘బిగ్ బేబీ’ (Big Baby). ప్రముఖ రాక్ సింగర్, దర్శకుడు స్పైడర్ వన్ (Spider One) తెరకెక్కించిన ఈ సైకలాజికల్ హారర్ డ్రామా ప్రస్తుతం రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి దీన్ని ఇండియాలో ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఆడమ్ లూయిస్ సక్సెస్‌ఫుల్ హారర్ స్క్రీన్‌ప్లే రైటర్. నెక్స్ట్ సినిమా కోసం ఒక మంచి సస్పెన్స్ కథ రాయాలని ఐడియాస్ కోసం చాలా స్ట్రగుల్ అవుతుంటాడు. ఆ సమయంలో అతనికి వరుసగా కొన్ని భయంకరమైన కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక భారీ సైకో కిల్లర్ పసిపాప మాస్క్ వేసుకుని మనుషుల్ని దారుణంగా చంపుతుంటాడు. ఆ కలలనే ఇన్‌స్పిరేషన్ గా తీసుకుని ఆడమ్ ‘బిగ్ బేబీ’ అనే కొత్త స్క్రిప్ట్ రాయడం మొదలుపెడతాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఆడమ్ తన స్క్రిప్ట్ లో ఎలాంటి మర్డర్స్ అయితే రాస్తాడో… సరిగ్గా అలాంటి హత్యలే రియల్ లైఫ్ లో కూడా జరగడం మొదలవుతుంది.
పసిపాప మాస్క్ వేసుకున్న ఆ కిల్లర్ ఆడమ్ కు దగ్గరైన వాళ్లనే టార్గెట్ చేస్తుంటాడు. అంతేకాదు, అతని స్క్రిప్ట్ లోని పాత్రలు కూడా ప్రాణభయంతో ఆడమ్ దగ్గరకు వస్తుంటాయి. దీంతో అతడు రాస్తున్న కథ, నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. అసలు ఆడమ్ రాస్తున్న కథ నిజంగానే జరుగుతోందా ? లేక అతడి ఊహలే అతడిని వెంటాడుతున్నాయా ? ఆ కిల్లర్ బారి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్ కేట్ ను ఎలా కాపాడుకున్నాడు ? అనేదే వెన్నులో వణుకు పుట్టించే ఈ కథ.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రైటర్ ఆడమ్ మైండ్ సెట్, అతని యాంగ్జైటీస్, వింత కలల చుట్టూ సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఎప్పుడైతే ఆ బేబీ మాస్క్ కిల్లర్ రియల్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తాడో, అప్పటినుంచి కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కిల్లర్ వేసుకునే ఆ బేబీ మాస్క్, అతడి క్రూరత్వం చూసేటప్పుడు గూస్ బంప్స్ గ్యారంటీ.
Also Read : వైరస్ దెబ్బకు మనుషులంతా జాంబీలుగా మారితే… క్షణక్షణం ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్
ఈ మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్‌లో బ్రాండన్ స్కాట్ (Brandon Scott), క్రిసీ ఫాక్స్ (Krsy Fox), ఆడమ్ మార్సినోవ్స్కీ (Adam Marcinowski), సియెర్రా మెక్‌కార్మిక్ (Sierra McCormick), జోర్డాన్ ఎల్సాస్ (Jordan Elsass), చాజ్ బోనో (Chaz Bono) తదితరులు నటించారు. స్పైడర్ వన్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ఈ సినిమా ప్రస్తుతం షడర్ (Shudder), ఏఎంసీ+ (AMC+) ప్లాట్‌ఫామ్‌లలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. సరికొత్త సైకో హారర్ థ్రిల్లర్ ను ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకునేవారు దీనిపై ఒక లుక్ వేయొచ్చు.